ssmb29లో చియాన్ విక్రమ్.. రచ్చ లేపుతున్న లేటెస్ట్ న్యూస్
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఎక్కువగా అంచనాలు ఉన్నాయి.
ఇక ఇందులో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఈ ముద్దుగుమ్మ. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ మూవీ గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ రూమర్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ కీలకపాత్ర పోషిస్తున్నాడట. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం జక్కన్న ఇప్పటికే విక్రమ్ ను సంప్రదించి స్టోరీ చెప్పాడని.. ఇక కథ నచ్చడంతో విక్రమ్ సైతం ఓకే చేసినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. కానీ ఒకవేళ మహేష్ బాబు, విక్రమ్ చియాన్, డైరెక్టర్ రాజమౌళి కాంబో నిజమైతే ఈ మూవీతో బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రంలో విక్రమ్ చియాన్ నటిస్తే ఈ మూవీపై మరింత అంచనాలు పెరగడం పక్కా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింపుల్ శారీ అనుకోకండి.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు
చెత్త సినిమా కోసం.. 700cr హిట్ సినిమా వదులుకుంది..
32ఏళ్ల తర్వాత బాలయ్య సినిమాలో విజయశాంతి

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
