హీరోగా 10 సినిమాల్లో ఫెయిల్.. కట్ చేస్తే 1200కోట్లకు సంపాదన!

Updated on: Mar 07, 2025 | 1:29 PM

సినీరంగంలో అతడు ఓ స్టార్ హీరో. కానీ కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలను, సవాళ్లను, విమర్శలను ఎదుర్కొన్నారు. అనేక అడ్డంకులను అధిగమించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇన్నాళ్లు హీరోగా వెండితెరపై సందడి చేసిన అతడు.. ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ పాత్రలో సత్తా చాటుతున్నారు. ఇంతకీ అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్.

బాలీవుడ్‌లో వన్‌ ఆఫ్ ది టాప్ సెలబ్రిటీగా కంటిన్యూ అవుతున్న ఇతడు.. ఇప్పుడు తన ఆస్తుల కారణంగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. నటుడు సైఫ్ అలీ ఖాన్ అడ్డంకులను, వైఫల్యాలను అధిగమించిన వ్యక్తి. అతన్ని మొదటి సినిమా నుండి తొలగించారు. అలాగే వరుసగా 10 సినిమాలు ప్లాప్ అయ్యాయి. కానీ ఆ తర్వాత సైఫ్ అలీఖాన్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. కోట్లలో రెమ్యునరేషన్‌ వసూలు చేస్తూ.. కోట్లలో ఆస్తులను కూడబెట్టాడు. ఇక ఎకనామిక్ టైమ్స్ ప్రకారం సైఫ్ ఆస్తులు 1200 కోట్ల రూపాయలట. అతను సంపాదించినవి.. తన తాత ముత్తాల నుంచి వచ్చిన ఆస్తులు మొత్తంగా లెక్కేస్తే ఇంకా విలువ పెరిగే ఛాన్స్ ఉందని కూడా బీ టౌన్‌లో టాక్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్నేహితుడితో గడిపిన పాపానికి గర్భం దాల్చా.. ఆ తర్వాత