Keerthy Suresh: మెగా Vs దళపతి.. కాంట్రవర్సీలో కీర్తి
కీర్తి సురేష్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి డ్యాన్సుల కంటే విజయ్ డ్యాన్సులంటేనే తనకు ఎక్కువ ఇష్టమని నిర్భయంగా వెల్లడించారు. ఈ విషయాన్ని భోళా శంకర్ సినిమా సమయంలో స్వయంగా చిరంజీవికి కూడా చెప్పినట్లు తెలిపారు. విజయ్‌తో చేసిన రెండు సినిమాల నుంచే ఆయన నృత్యాలంటే ఆమెకు అభిమానం. మహానటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మీకు నచ్చింది చెప్పండి అంటే నాకు నచ్చింది చెప్పమనేగా.. మీ అందరికీ నచ్చిందని నేను కొత్త విషయాన్ని ఎందుకు చెప్పాలి? అయినా నాకు నచ్చిన విషయం మీ అందరికీ నచ్చిన వారికి కూడా చాలా బాగా తెలుసు అని అంటున్నారు కీర్తీ సురేష్. ఇక్కడ కీర్తికి నచ్చిన విషయం ఏంటి? అందరికీ నచ్చిన విషయం ఏంటి అంటారా? చూసేద్దాం పదండి… రివాల్వర్ రీటా ప్రమోషన్ల సంగతేమోగానీ, మిగిలిన విషయాల కోసం ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు కీర్తి సురేష్. వర్కింగ్ హవర్స్ మీద ఆమె ఇచ్చిన క్లారిటీ విన్నవారు.. మెగాస్టార్ డ్యాన్సుల గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. విన్నారుగా అదీ సంగతి. తనకు విజయ్ డ్యాన్సులంటే ఇష్టమని మెగాస్టార్‌కి కూడా చెప్పారట కీర్తి. ఆయన కూడా స్పోర్టివ్‌గానే తీసుకున్నారట. మెగాస్టార్‌తో భోళా శంకర్ చేసేటప్పుడు ఈ ముచ్చట వచ్చిందని గుర్తుచేసుకున్నారీ లేడీ. విజయ్‌తో తమిళ్‌లో రెండు సినిమాలు చేశారు కీర్తీ సురేష్. భైరవ, సర్కార్‌లో వీరిద్దరూ కలిసి నటించారు. చిన్నప్పటి నుంచి దళపతి డ్యాన్సులంటే తెగ ఇష్టపడ్డ విషయాన్ని ఆయనతోనూ షూటింగ్ గ్యాప్‌లో చెప్పేవారట కీర్తి. మెగాస్టార్ అంటే గౌరవం ఉందని, విజయ్ అంటే ఇష్టమని చెప్పడానికి ఎప్పుడూ ఇబ్బంది పడనంటున్నారు మహానటి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది