మొన్న దీపిక.. నిన్న రష్మిక.. నేడు కీర్తి సురేష్.. అందరూ ఒకే దారిలో..
ఇండియన్ సినిమాలో 8 గంటల పని విధానంపై దీపికా పదుకొనే మొదలుపెట్టిన చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. కీర్తి సురేష్, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్లు సైతం తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సుదీర్ఘ పని గంటలు, తక్కువ నిద్ర, ఆలస్య భోజనాలతో ఎదుర్కొంటున్న సమస్యలను వారు వెల్లడిస్తున్నారు. హీరోల తక్కువ పనిగంటలు, ఇండస్ట్రీలో మగవారి ఆధిపత్యంపై వాదనలు జరుగుతున్నాయి. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏ ముహూర్తాన దీపిక పదుకొనే 8 వర్కింగ్ హవర్స్ గురించి మాట్లాడిందో తెలియదు కానీ అప్పట్నుంచి ఇండస్ట్రీలో దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు ఒక్కొక్కరుగా తమ వర్కింగ్ హవర్స్‌పై ఓపెన్ అవుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ సైతం దీనిపై స్పందించారు. మరి ఆమె ఏమన్నారు.. అసలు 8 హవర్స్ వర్కవుట్ అవుతుందా..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. వింటున్నారుగా కీర్తి సురేష్ ఏమంటున్నారో..? తాజాగా ఇండియన్ సినిమాలో 8 హవర్స్ వర్కింగ్ గురించి పెద్ద చర్చే జరుగుతుంది. కీర్తి సైతం దీనిపై స్పందించారు. తను పర్సనల్‌గా 9 టూ 6తో పాటు 9 టూ 9కి కూడా ఓకే గానీ.. ఇందులో కొన్ని సమస్యలున్నాయన్నారు కీర్తి. దీనిపై ఆమె ఏమన్నారో ఇంకా డీటైల్డ్‌గా విందాం పదండి. కీర్తి చెప్పింది కూడా నిజమే.. 9కి షాట్ అంటే 7.30కి లొకేషన్.. 5.30 గంటలకు నిద్ర లేవాలి. అంతా చేసినా నైట్ 11 వరకు డిన్నర్ కావట్లేదు.. ఇక 9 టూ 9 అంటే కనీసం 3 గంటల నిద్ర కూడా ఉండదంటున్నారు ఈ బ్యూటీ. ఆ మధ్య రష్మిక మందన్న సైతం ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. తాను ఓవర్ టైమ్ వర్క్ చేసాను కానీ అది అంత మంచిది కాదన్నారు రష్మిక. వీటన్నింటికీ మూలం దీపిక పదుకొనే దగ్గర మొదలైంది. కల్కి 2, స్పిరిట్ నుంచి తప్పించిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు దీపిక. ఇండియన్ సినిమా అనేది పూర్తిగా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని.. ఇక్కడ కొన్నేళ్లుగా చాలా మంది హీరోలు 8 గంటలే పని చేస్తున్నారన్నారు దీపిక. మండే టూ ఫ్రైడే మాత్రమే పని చేసి వీకెండ్ ఎంజాయ్ చేస్తారు.. అయినా హీరోలను అడిగే ధైర్యం ఉండదన్నారు ఈ బ్యూటీ. తను మాత్రమే కాదు.. ఈ మధ్య కొత్తగా అమ్మ అయిన హీరోయిన్లు కూడా 8 గంటలే పని చేస్తున్నారని విన్నానని.. కానీ వాళ్లెవరూ హెడ్ లైన్స్ తాను తప్ప అన్నారు దీపిక. అన్నిచోట్ల 8 గంటలే పని చేస్తున్నపుడు సినిమాల్లోనే ఎందుకిలా అన్నారు దీపిక. మరోవైపు అలియా భట్ లాంటి వాళ్లు అమ్మయ్యాక కూడా నిర్మాతలకు అనుగుణంగా పని చేస్తున్నారు. మొత్తానికి దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది