పాముల భయంతో.. కార్తికేయను మిస్ చేసుకున్న స్టార్ హీరో..
అప్పటి వరకు టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా మాత్రమే సినిమా చేసుకుంటూ పోతున్న నిఖిల్‌ను.. ఒక్క సారిగా పాన్ ఇండియా స్టార్గా మార్చిన సినిమా కార్తికేయ. చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా, ఆ తర్వాత వచ్చిన కార్తికేయ సీక్వెల్‌తో నిఖిల్.. క్రేజ్ అండ్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. అయితే నిఖిల్‌కు ముందు ఈ సినిమా టాలీవుడ్‌లోని మరో స్టార్ హీరో దగ్గరికి వెళ్లిందని... కానీ పాములంటే భయపడే ఆ హీరో.. కార్తికేయ సినిమాను రిజెక్ట్ చేశారనే విషయం ఇప్పుడు బయటికి వచ్చింది.
అది కాస్తా ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. కార్తికేయ సినిమా సుబ్రహ్మణ్యపురం అనే గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో పాములు కూడా కీలక పాత్ర పోషించాయి. సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో సుబ్రహ్మణ్య స్వామి గుడికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందామని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ పాము కాటుకి చనిపోతుంటారు. ఆ గుడికి సంబంధించిన రహస్యం ఏమిటనేది తెలుసుకోవాలని తన ప్రయత్నం మొదలు పెడతాడు ఆ ఊరికి మెడికల్ క్యాంప్ మీద వచ్చిన వైద్య విద్యార్థి కార్తీక్ అలియాస్ నిఖిల్… ఏటా కార్తీక పౌర్ణమికి వెలుగులు విరజిమ్మే ఆ గుడి వెనుక రహస్యం ఏమిటి? ఒకప్పుడు ఎంతో ఖ్యాతి గడించిన ఆ గుడిని గురించి ఎవరైనా మాట్లాడినా కానీ ఎందుకని చనిపోతున్నారు? ఆ రహస్యం ఛేదించడానికి చేసే ప్రయత్నంలో కార్తీక్‌కి ఏమవుతుంది అన్న నేపథ్యంలో కార్తికేయ సినిమా సాగుతుంది. అయితే ఈ సినిమాకు నిఖిల్ ఫస్ట్ ఛాయిస్ కాదనే విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. దర్శకుడు చందూ మొండేటి మొదట ఈ సినిమా కథను అల్లరి నరేష్ ను దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేశాడట. కథ కూడా వినిపించాడట. అయితే సినిమాలో పాములు ఉంటాయనే ఒకే ఒక్క కారణంతో అల్లరి నరేష్ కార్తికేయ సినిమాను వదులుకున్నాడట. నిజ జీవితంలో మాత్రమే కాదు వెండితెరపై కూడా పాములకు సంబంధించిన సన్నివేశాలు చూసినా తాను భయపడతానని అల్లరి నరేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఈ కారణంతోనే కార్తికేయ సినిమాను వదులుకున్నానని కూడా ఈ అల్లరోడు రివీల్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చీమలు తయారుచేసిన యోగర్ట్ ను చూశారా
ఈ 4 తప్పులే ఆయుష్షును తగ్గించేస్తున్నాయా ?? మరి, జపనీయుల ఆరోగ్య రహస్యం ఏమిటి?
కోరింత దగ్గు చిన్నారులకు ప్రాణాంతకం.. గర్భిణిగా ఉన్నప్పుడే టీకా వేస్తే
