Usha Rani: కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.!
బుల్లితెరలో కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్ల పాటు బుల్లితెర ఆడియెన్స్ ను అలరించిందీ ఈ సీరియల్. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కార్తీక దీపం 2 సీరియల్ కూడా వస్తోంది. ఇక ఈ సంగతి పక్కన పెడితే ఈ సీరియల్ లో నటిస్తోన్న ఒక నటికి చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను బయటకు చెప్పుకోరు.
బుల్లితెరలో కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్ల పాటు బుల్లితెర ఆడియెన్స్ ను అలరించిందీ ఈ సీరియల్. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కార్తీక దీపం 2 సీరియల్ కూడా వస్తోంది. ఇక ఈ సంగతి పక్కన పెడితే ఈ సీరియల్ లో నటిస్తోన్న ఒక నటికి చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను బయటకు చెప్పుకోరు. కానీ ఆమె మాత్రం ఈ విషయాన్ని అభిమానులు, నెటిజన్లతో పంచుకుంది. సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి ‘మీరు నాలా మోసపోకండి’ అని హెచ్చరించింది.
ఇక అసలు విషయం ఏంటంటే..! కార్తీకదీపం 2లో కీలక పాత్రలో నటిస్తోంది నటి ఉషారాణి. దీపకు అత్త క్యారెక్టర్ చేస్తున్న ఆమె.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇక ఆ వీడియోలోనే తనకు జరిగిన మోసం గురించి చెప్పింది. ఎమోషనల్ అయింది. డీఎస్పీ అంటూ.. తనకో వ్యక్తి ఫేక్ కాల్ చేశాడని.. ఓటీపీ అడిగాడని.. కానీ తాను ఆ వ్యక్తి బుట్టలో పడలే కాబట్టి.. బతికిపోయా అని చెప్పింది. ఒక వేళ.. ఆ డీఎస్పీ అని చెప్పిన వ్యక్తి అడిగినట్టు తన మొబైల్ కు వచ్చిన ఓటీపీ చెబితే.. తన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యేదని ఆవేదన వ్యక్తిం చేసింది. ఇదే విషయాన్ని చెబుతూ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో వపోస్ట్ చేసింది ఈ నటి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.