Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

|

Jan 12, 2023 | 8:38 AM

భూత కోలా అనే ఎపిసోడ్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో థ్రిల్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది.


డబ్బింగ్ చిత్రంగా తెలుగులో విడుదలైన ‘కాంతార’ చిత్రం.. దాదాపు 25 కోట్ల రూపాయలకు పైగా లాభాలను గడించింది. ఈ చిత్రంలో రిష‌బ్‌శెట్టి హీరోగా నటించి దర్శకత్వం కూడా తానే చేశాడు. కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వ‌సూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. బాలీవుడ్‌లో సైతం ఈ మూవీ 100 కోట్లు వసూలు చేసింది. భూత కోలా అనే ఎపిసోడ్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో థ్రిల్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఈ సినిమా లాజిక్ లెస్ అని అంటున్నారు. ఈ సినిమాలో కోలం ఆడే వ్యక్తిలోకి దేవుడు అవహించినట్లు చూపిస్తారు. ఒక రాజు అడవిలో ఉండే జనాలకు తన భూమి దానం చేస్తాడు. కొన్నేళ్ల తర్వాత అతని వారసుడు వచ్చి ఆ భూమి నాది అంటాడు. కోలమాడే వ్యక్తి తండ్రితో నా భూమి నాకు కావాలి అంటాడు. అప్పుడు కోలం ఆడే వ్యక్తిలో దేవుడు ప్రవేశించి నువ్వు కోర్టు మెట్లపై రక్తం కక్కుకుని చచ్చిపోతావు అంటాడు.. అన్నట్లుగానే జరుగుతుంది. ఆ వ్యక్తి కోర్టు మెట్లపై రక్తం కక్కుకొని చనిపోతాడు.ఇంకొంత కాలం తర్వాత అదే రాజ కుటుంబానికి చెందిన మరో వారసుడు వచ్చి ఆ భూమిని ఆక్రమించుకోవాలని కుట్రలు పన్నుతాడు. క్లైమాక్స్‌లో కోలం ఆడే వ్యక్తిని తన స్వార్థం కోసం ఆ రాజకుటుంబీకుని వారసుడి చంపేస్తాడు. జనాలను కూడా దారుణంగా కాల్చేస్తాడు. చివర్లో హీరో కూడా కోలం ఆడుతాడు. అతను తన ప్రజలను వారికి సహాయం చేసిన పోలీస్ ఆఫీసర్‌కు అప్పగిస్తున్నట్టు సినిమాలో చూపించారు.అయితే కోలం ఆడే వ్యక్తిలో నిజంగా దేవుడు వస్తే ఆ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి అనగా ఆ ఊరికి పెద్దదిక్కు అని జనాలు నమ్ముతున్న వ్యక్తి దుర్మార్గుడు అని ప్రజలకు ఎందుకు చెప్పలేదు. చెబితే వారు ముందుగా జాగ్రత్త పడతారు కదా.! అనే లాజిక్కును బయటకు తీస్తున్నారు. కానీ సినిమాలలో అలా వీలు కాదు. హీరోకి విలన్ తెలిసిన తర్వాత సినిమా మొదట్లోనే హీరోనే విలన్‌ని చంపేస్తే ఇక ఆ సినిమా కథ సాగేదెలా? కాబట్టి ఇలాంటి చిన్న చిన్న లాజిక్కుల కోసం వెంపర్లాడి తమ‌ మేధావిత్తనం చూపించి కాంతార వంటి మంచి చిత్రాన్ని విమర్శించడం సరికాదని మరికొంద‌రు వాదిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 12, 2023 08:38 AM