కాంతారకు రూ.కోట్లలో కలెక్షన్స్‌ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు

Updated on: Oct 13, 2025 | 5:29 PM

కాంతార చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. విడుద‌లైన 9 రోజుల్లోనే ప్రపంచ‌వ్యాప్తంగా రూ.509 కోట్ల వ‌సూళ్లను రాబ‌ట్టిన‌ట్లు చిత్రబృందం ప్రక‌టించింది. దీంతో స్టార్‌ యాక్టర్ రిష‌బ్ శెట్టి ఫుల్‌ జోష్‌ మీదున్నారు. ప్రస్తుతం సినిమా సక్సెస్‌న్‌ రిషబ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా ముంబై లోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు.

అక్కడ ప్రత్యేక పూజలు చేసారు. దర్శనానంతరం నటుడికి ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన రిషబ్‌ శెట్టి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా కాంతార చాఫ్టర్ 1 ద‌స‌రా కానుక‌గా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. మొద‌టిరోజు నుంచే బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా మ‌రో అరుదైన రికార్డును అందుకుంది. విడుద‌లైన 9 రోజుల్లోనే ప్రపంచ‌వ్యాప్తంగా 509 కోట్ల రూపాయల వ‌సూళ్లను రాబ‌ట్టిన‌ట్లు చిత్రబృందం ప్రక‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్టర్‌ను షేర్‌ చేసింది హోంబలె ఫిల్మ్స్‌. ఈ వీకెండ్ కూడా థియేట‌ర్‌ల‌లో పెద్ద సినిమాలేవి లేక‌పోవ‌డంతో కాంతార మ‌రిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొన్న విజయ్..నేడు రష్మిక..ఎంగేజ్మెంట్‌ రింగ్స్‌తో లవ్ బర్డ్స్

ప్రధాని మోదీకి రామ్ చరణ్‌.. స్పెషల్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్

NTRపై బాలీవుడ్ స్టార్ వివాదాస్పద వ్యాఖ్యలు !! బుద్ది చెప్పాల్సిందే

టెంపర్ సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఫలితం NTR ఖాతాలో దిమ్మతిరిగే హిట్

వరస ప్రాజెక్ట్‌లతో సత్తా చూపిస్తున్న భీమ్స్