Sudeep: శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.! దర్శన్‌ కేసుపై సుదీప్ సీరియస్ కామెంట్స్.

రేణుకాస్వామి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. కన్నడ హీరో దర్శన్.. నటి పవిత్రగౌడతోపాటు మరో పదమూడు మందిని అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు. అయితే వీరిని ఐదు రోజులు కస్టడీలోకి తీసుకోవాలనే పోలీసుల అభ్యర్థనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈక్రమంలోనే దర్శన్ కేసుపై ఇప్పటికే పలువురు కన్నడ సెలబ్రెటీలు స్పందించారు.

Sudeep: శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.! దర్శన్‌ కేసుపై సుదీప్ సీరియస్ కామెంట్స్.

|

Updated on: Jun 18, 2024 | 11:03 AM

రేణుకాస్వామి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. కన్నడ హీరో దర్శన్.. నటి పవిత్రగౌడతోపాటు మరో పదమూడు మందిని అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు. అయితే వీరిని ఐదు రోజులు కస్టడీలోకి తీసుకోవాలనే పోలీసుల అభ్యర్థనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈక్రమంలోనే దర్శన్ కేసుపై ఇప్పటికే పలువురు కన్నడ సెలబ్రెటీలు స్పందించారు. తాజాగా హీరో సుదీప్ కూడా దర్శన్ కేసుపై ఊహించని విధంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో నేరస్థుడికి శిక్ష పడితే ఇండస్ట్రీలో సంతోషిస్తుందని అన్నారు. అలాగే న్యాయం గెలవాలని.. రేణుకస్వామి భార్యకు న్యాయం జరగాలని స్టేట్మెంట్ ఇచ్చారు.

ఇంతకీ సుదీప్ దర్శన్ కేసు విషయంలో ఎగ్జాక్ట్ గా ఏం మాట్లాడారంటే..
“ఇదంతా నాకు తెలుసు.. మీడియా ఏం చూపిస్తున్నారో మాకు తెలుసు. నిజానిజాలను బయటకు తీసుకురావడానికి మీడియా, పోలీసు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో రెండో మాట లేదు నాకు తెలిసి ఈ కేసు విషయంలో సీఎం స్వయంగా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల మీ వార్తల్లో చూశాను. కర్నాటకలో పెద్ద పదవిలో ఉన్న ఆయన మీడియా, పోలీసులు సక్రమంగా పనిచేస్తుంటే సామాన్యుడిగా ఆ ఆర్టిస్టు పేరు రాదని నా అభిప్రాయం. నేను వారికి మద్దతుగా మాట్లాడటం చాలా తప్పు. అలాగే వ్యతిరేకంగా మాట్లాడినా తప్పే అవుతుంది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. రోడ్డుపై అనాథ శవంలా పడిపోయిన రేణుకస్వామి కుటుంబానికి న్యాయం జరగాలి. పుట్టబోయే బిడ్డకు న్యాయం చేయాలి. అన్నింటికీ మించి న్యాయంపై అందరికీ నమ్మకం ఉండాలి అంటే ఈ కేసులో మంచి న్యాయం జరగాలి” అని కిచ్చా సుదీప్ అన్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరి హృదయం ఆ కుటుంబానికి అండగా ఉండాలన్నారు. జరిగింది ఏంటో తెలియకుండా చిత్ర పరిశ్రమపై నిందలు వేయడం సరికాదన్నారు. సినిమా ఇండస్ట్రీకి క్లీన్ చిట్ రావాలని.. దోషికి శిక్ష పడితే సినీ పరిశ్రమ సంతోషిస్తుందంటూ సుదీప్ చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us