Kala Tapasvi K. Viswanath Live: ఐదు దశాబ్దాలుగా చిత్రసీమపై చెరగని ముద్ర వేసిన ‘కళాతపస్వి కె.విశ్వనాధ్’ కు ప్రముఖుల నివాళి..(లైవ్)
ప్రశస్తమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు గౌవరవాన్ని, గుర్తింపును తెచ్చిన కళాదర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా స్థాయిని రెపరెప లాడించిన కె.విశ్వనాథ్.. తీసిన 60 చిత్రాల్లో ఎన్నో గొప్పఅవార్డులను, రివార్డ్‌లను స్వంతం చేసుకున్నారు.
ప్రశస్తమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు గౌవరవాన్ని, గుర్తింపును తెచ్చిన కళాదర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా స్థాయిని రెపరెప లాడించిన కె.విశ్వనాథ్.. తీసిన 60 చిత్రాల్లో ఎన్నో గొప్పఅవార్డులను, రివార్డ్‌లను స్వంతం చేసుకున్నారు.తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెప లాడించిన దిగ్గదర్శకుడు కళా తపస్వి కె. విశ్వనాథ్.. తెలుగు సినిమాకు సిరివెన్నెలలు కురిపించిన ఆపద్భాందవుడు. ఎన్నో చిత్రాల్లో భావుకత, ఆర్ధ్రత, కుటుంబ, సామాజిక అంశాలు సృజించడంలో విశ్వనాథ్ శైలే వేరు. కళాతపస్వి కె.విశ్వనాథ్ పేరు చెబితే ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘సిరిసిరిమువ్వ’ సినిమాలు గుర్తుకువస్తాయి. తెలుగు సినిమాల్లో సంగీతానికి పెద్ద పీటవేసి, శృతిలయలు నేర్పిన దర్శక యశస్వీ, కళా తపస్వి.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కె.విశ్వనాథ్. విశ్వనాథ్ తన చిత్రానికి దర్శకత్వం వహించేటపుడు ఖాకీ దుస్తుల్లో ఉండటం ఆయన ప్రత్యేకత.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..