జాన్వీకపూర్‌కు అండాదండా ఆయనేనా

Edited By: Phani CH

Updated on: Oct 25, 2025 | 11:30 AM

హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా జాన్వీ కపూర్‌కు బాలీవుడ్‌లో దిక్కు మాత్రం ఆయనొక్కడే. పరిచయం చేసాననే బాధ్యతో లేదంటే శ్రీదేవిపై ఉన్న అభిమానమో తెలియదు గానీ జాన్వీ పూర్తి బాధ్యత బోనీ కపూర్ కంటే ఎక్కువగా తీసుకున్నారు ఓ నిర్మాత. ఆమె ఎప్పుడు ప్లాపుల్లో ఉన్నా.. నేనున్నా అంటూ ముందుకొస్తున్నారు. ఇప్పుడూ ఇదే చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నిర్మాత..? ఏళ్లు గడుస్తున్నాయి గానీ జాన్వీ కపూర్‌కు బాలీవుడ్‌లో కోరుకున్న హిట్ మాత్రం రావట్లేదు.

2018లో ధడక్ సినిమాతో ఆమెను పరిచయం చేశారు కరణ్ జోహార్. ఆ తర్వాత ధర్మా ప్రొడక్షన్స్‌లోనే ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ లాంటి సినిమాలు చేసారు. అయితే హిట్లు లేక.. స్టార్ కిడ్ అయినప్పటికీ కెరీర్‌ పరంగా వెనకబడిపోయారు జాన్వీ కపూర్. ఒక హీరోయిన్‌కు సక్సెస్ అనేది చాలా కీలకం. ఈ విషయంలో జాన్వీ వెనుకబడి ఉన్న సమయంలో.. కరణ్ జోహార్ ఆమెకు అండగా నిలబడుతున్నారు. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా.. కరణ్ జోహార్ తన బ్యానర్‌లో జాన్వీకి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. మొన్నొచ్చిన సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి కూడా కరణ్ బ్యానర్‌లోనే వచ్చింది.. అంతెందుకు దేవరను హిందీలో రిలీజ్ చేసింది ఈయనే. జాన్వీ కపూర్ ఫ్లాపులను పట్టించుకోకుండా ఆఫర్స్ ఇస్తూనే ఉన్నారు కరణ్ జోహార్. టైగర్ ష్రాఫ్, లక్ష్య ప్రధాన పాత్రల్లో తాను నిర్మిస్తున్న భారీ యాక్షన్ డ్రామాలో కూడా జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నారు కరణ్ జోహార్. ఈయన అండతో తన కెరీర్‌ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ బ్యూటీ. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Diwali: టపాసుల్లా కార్బైడ్ గన్‌ను పేల్చి .. కంటి చూపు కోల్పోయిన 14 మంది

కళ్యాణమండపానికి వచ్చిన అనుకోని అతిథి

వ్యాపారులకు దొంగబాబాల బురిడీ.. పౌడర్‌ చల్లి.. డబ్బుతో పరార్‌

మహిళలకు ఆన్‌లైన్ ఉగ్రవాద కోర్సు

అమెరికా విద్యార్థి వీసా రూల్స్ మరింత కఠినం.. భారత విద్యార్థులకు ఇబ్బందే

Published on: Oct 25, 2025 11:28 AM