బాలీవుడ్ హీరోయిన్స్ కాదు.. కేరాఫ్ టాలీవుడ్ వాళ్లు
2026 నాటికి బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్‌లో కీలక పాత్రలు పోషించనున్నారు. జాన్వి కపూర్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా వంటి అగ్ర తారలతో పాటు రషా థడాని వంటి కొత్త తరం నటీమణులు కూడా హైదరాబాద్‌ను తమ కార్యక్షేత్రంగా మార్చుకుంటున్నారు. వీరంతా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ప్రాజెక్టులతో బిజీగా గడపనున్నారు.
పేరుకేమో వాళ్లు బాలీవుడ్ హీరోయిన్లు.. కానీ 2026లో వాళ్లు చేసే సినిమాలన్నీ తెలుగులోనే..! టాప్ బ్యూటీస్ నుంచి చిన్న హీరోయిన్ల వరకు ముంబై ముద్దుగుమ్మల కేరాఫ్ అడ్రస్ 2026లో హైదరాబాద్ కాబోతుంది. టాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తూ బిజీ కాబోతున్నారు ఆ ముద్దుగుమ్మలంతా. మరి హైదరాబాద్‌కు మకాం మారుస్తున్న ఆ బ్యూటీస్ ఎవరు..? 2026లో బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది తెలుగులోనే కనిపించబోతున్నారు. అందులో ముఖ్యంగా జాన్వీ కపూర్ గురించి చెప్పుకోవాలి. ఆల్రెడీ పెద్దిలో చరణ్‌తో కలిసి నటిస్తున్న ఈ బ్యూటీ.. జూన్ నుంచి దేవర 2 సెట్స్‌లో జాయిన్ కానున్నారు.. అలాగే అల్లు అర్జున్, అట్లీ సినిమాలో కూడా జాన్వీ నటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీపిక పదుకొనే కూడా బాలీవుడ్ కంటే టాలీవుడ్‌పైనే ఫోకస్ చేసారిప్పుడు. అల్లు అర్జున్ AA22తో బిజీగా ఉన్నారీమే. ఇందులో జాన్వీ, మృణాళ్ కూడా నటిస్తున్నా.. మెయిన్ హీరోయిన్ మాత్రం దీపికనే. ఈమెపై యాక్షన్ సీన్స్ బాగానే ప్లాన్ చేస్తున్నారు అట్లీ. కల్కి 2ను కాదనుకుని మరీ.. అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు దీపిక పదుకొనే. ప్రియాంక చోప్రా సైతం మరో ఏడాది వరకు టాలీవుడ్ హీరోయినే.. రాజమౌళి, మహేష్ బాబు వారణాసిలో నటిస్తున్నారు పిగ్గీ చోప్స్. ఎప్రిల్ 7, 2027న వారణాసి విడుదలయ్యే వరకు ప్రియాంక ఉండేది హైదరాబాద్‌లోనే. ఇక రవీనా టాండన్ కూతురు రషా తడాని సైతం శ్రీనివాస మంగాపురం కోసం టాలీవుడ్‌కు మకాం మార్చేసారు. మొత్తానికి ఈ ముంబై బ్యూటీస్ కేరాఫ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీనే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్టు కోసం అష్టకష్టాలు.. అయినా కరుణించని విజయం
Kerala Story 2: మరో కాంట్రవర్సీకి రంగం సిద్ధం.. రచ్చ చేస్తున్న కేరళ స్టోరీ 2 టీజర్
దసరాపై దండయాత్ర.. రేసులో ముగ్గురు స్టార్స్
TOP 5 ET: మరో వార్.. మరి ఈ సారి ఏమువుతుందో..? | నైజాంలో చిరు నయా రికార్డ్