Jabardasth Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ సెగ.. పోలీసులకు ఫిర్యాదు.. ( వీడియో )
Jabardasth Hyper Aadi

Jabardasth Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ సెగ.. పోలీసులకు ఫిర్యాదు.. ( వీడియో )

Updated on: Jun 15, 2021 | 9:20 AM

బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మరో వివాదంలో చిక్కుకున్నాడు. కామెడీతో పాటు కాంట్రవర్సీలు కూడా ఈయనకు ముందు నుంచి అలవాటు.

బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మరో వివాదంలో చిక్కుకున్నాడు. కామెడీతో పాటు కాంట్రవర్సీలు కూడా ఈయనకు ముందు నుంచి అలవాటు. ప్రతీసారి స్కిట్స్‌లో ఈయన చేసే కామెడీ కొందరి మనోభావాలను దెబ్బ తిస్తూనే ఉంటుందంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి.వ్యక్తుల వరకు అయితే ఓకే కానీ వ్యవస్థను విమర్శిస్తే తిప్పలు తప్పువు. ఇప్పుడు ఇదే జరిగింది. హైపర్ ఆదికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు. దానికి కారణం ఈయన తెలంగాణ బాష, యాసను అవమానిస్తూ మాట్లాడటమే.హైపర్ ఆదిపై ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. జూన్ 12 ఆదివారం రోజున ఈ టీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో తెలంగాణ బతుకమ్మను, గౌరమ్మను, తెలంగాణ భాష యాసని కించపరిచే విధంగా ఆది స్క్రిప్ట్ చేశాడని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Puri Jagannadh: మ‌నకు జ‌బ్బులు రావ‌డానికి అస‌లు కార‌ణం అదే.. పూరీ మార్క్ విశ్లేష‌ణ.. ( వీడియో )

Pooja Hegde: తను అనుకున్న కల తీరింది అని చెబుతోన్న పూజ.. ఇంతకీ ఆ కల ఏంట‌నేగా..?? ( వీడియో )