Naga Chaitanya Thandel: ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.! తండేల్ నుంచి దిమ్మతిరిగే అప్డేట్..

| Edited By: Ram Naramaneni

Feb 22, 2024 | 8:21 PM

ఇటీవలే ‘ధూత’ వెబ్ సిరీస్‏తో ఓటీటీలోకి అడుగుపెట్టాడు యువసామ్రాట్ నాగచైతన్య. సస్పెన్స్ థ్రిల్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్‏లో చైతూ మొదటిసారిగా జర్నలిస్ట్ పాత్రలో కనిపించారు. ఇందులో చైతూ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు చైతూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం తండేల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్‎లోనే భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం.

ఇటీవలే ‘ధూత’ వెబ్ సిరీస్‏తో ఓటీటీలోకి అడుగుపెట్టాడు యువసామ్రాట్ నాగచైతన్య. సస్పెన్స్ థ్రిల్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్‏లో చైతూ మొదటిసారిగా జర్నలిస్ట్ పాత్రలో కనిపించారు. ఇందులో చైతూ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు చైతూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం తండేల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్‎లోనే భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం కోసం చైతూ తన లుక్ పూర్తిగా మార్చేసి రగ్గడ్ లుక్‏లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి లీకైన చైతన్య ఫోటో చూస్తే.. ఇందులో చైతూ ఊరమాస్ అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే… తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అందించారు మేకర్స్.

కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ కొత్త షెడ్యూల్ సముద్రం మధ్యలో జరగనుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సినిమా నుంచి చైతుపై ఓ ఎనర్జిటిక్ స్టిల్ రివీల్ చేశారు. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ అందిస్తామని అంటున్నారు మేకర్స్. మొత్తానికి ఈ క్రేజీ అప్డేట్ తో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. మత్య్సకారుల జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్. చైతూ చివరిసారిగా కస్టడీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఇందులో కృతిశెట్టి కథానాయికగా నటించగా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Dec 27, 2023 11:07 AM