Allu Arjun: మరో మల్టీప్లెక్స్‌కు ప్లాన్ చేస్తోన్న అల్లు అర్జున్.. ఎక్కడంటే.?
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు సినిమాలతో పాటు బిజినెస్ లోనూ అదరగొడుతున్నారు. రకరకాల వ్యాపారాల్లో కోట్లు ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమలో థియేటర్ బిజినెస్ బాగా ఊపందుకుంది. స్టార్ హీరోలు సైతం ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లను రన్ చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు సినిమాలతో పాటు బిజినెస్ లోనూ అదరగొడుతున్నారు. రకరకాల వ్యాపారాల్లో కోట్లు ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమలో థియేటర్ బిజినెస్ బాగా ఊపందుకుంది. స్టార్ హీరోలు సైతం ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లను రన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కు AAA, మహేశ్ బాబుకు AMB, అలాగే విజయ్ దేవరకొండ కు VD పేరుతో హైదరాబాద్ నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. త్వరలోనే మాస్ మహరాజా రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఏషియన్ సంస్థతో కలిసి ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. కాగా, హైదరాబాద్ లో AAA పేరుతో మల్లీప్లెక్స్ థియేటర్ నిర్వహిస్తోన్న అల్లు అర్జున్ ఇప్పుడు తన బిజినెస్ ను మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారట. అయితే అది తెలంగాణలో కాదు ఏపీలో. అవును విశాఖ పట్నంలో అర్జున్ AAA మల్టీప్లెక్స్ కు ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం వైజాగ్‌లో కొత్తగా కడుతున్న ఇనార్బిట్ మాల్‌లో ఏషియన్ సంస్థతో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్ ను ఏర్పాటుచేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
