Arjun Ambati: ‘విరూపాక్ష’లో ముందు హీరో నేనే.! కానీ.. అర్జున్ అంబాటి షాకింగ్ కామెంట్స్.

అగ్నిసాక్షి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అర్జున్ అంబాటి. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన అర్జున్ తనదైన ఆట తీరుతో విన్నర్ రేసులో దూసుకుపోయి.. టాప్ 5లో నిలిచాడు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ల పాటు బయట ఎక్కడా కనిపించని అర్జున్‌ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూకు వచ్చాడు. రావడమే కాదు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

Arjun Ambati: 'విరూపాక్ష'లో ముందు హీరో నేనే.! కానీ.. అర్జున్ అంబాటి షాకింగ్ కామెంట్స్.

|

Updated on: Mar 26, 2024 | 11:32 AM

అగ్నిసాక్షి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అర్జున్ అంబాటి. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన అర్జున్ తనదైన ఆట తీరుతో విన్నర్ రేసులో దూసుకుపోయి.. టాప్ 5లో నిలిచాడు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ల పాటు బయట ఎక్కడా కనిపించని అర్జున్‌ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూకు వచ్చాడు. రావడమే కాదు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. సాయి ధరమ్‌ తేజ్‌ చేసిన విరూపాక్ష సినిమాలో.. తనే మొదట హీరో అంటూ చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. సాయి ధరమ్‌ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాకు ముందుగా తననే హీరోగా అనుకున్నారని.. ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు అంబటి అర్జున్. కానీ కొన్ని కారణాలతో అది కుదలేదంటూ.. కాస్త ఫీలయ్యాడు. అయినా కానీ తాను సంతోషంగానే ఉన్నట్టు చెప్పాడు. ఎందుకంటే తనతో ఆ సినిమా చేసుంటే అంత పెద్ద సక్సెస్ కాకపోయి ఉండేదన్నాడు. “డైరెక్టర్ కార్తీక్ నా స్నేహితుడు. ఎప్పుడూ అతను సినిమా ప్రపంచంలో ఉంటాడు. ఇద్దరం కలిసి లూప్ అనే వెబ్ ఫిల్మ్ చేశాం. ఆ తర్వాత ఓ సినిమా చేయాలనుకున్నాం. అందుకు కథ రెడీ చేసుకుని నిర్మాతల కోసం వెతికాం. కానీ కుదరలేదు. ఆ సినిమాకు ముందుగా శాసనం అని టైటిల్ పెట్టుకున్నాం. ఆ తర్వాత సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఆ సినిమా స్టోరీకి కొన్ని మార్పులు చేసి రూపొందించారు. అదే విరూపాక్ష. ఈ సినిమాకు ముందుగా లీడ్ రోల్ నన్ను అనుకున్నారు. కానీ కుదరలేదు. అయినా ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను. నాతో చేసుంటే అంత పెద్ద సక్సెస్ వచ్చేది కాదేమో” అంటూ చెప్పుకొచ్చాడు అర్జున్ అంబటి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో