సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే ??

Updated on: Jan 17, 2025 | 1:56 PM

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు ఓ దుండగుడు. అతనిపై కత్తితో దాడికి పాల్పడటంతో తీవ్రగాయాలపాలైన సైఫ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో ఇంట్లో సైఫ్ అలీఖాన్ పిల్లలతో ఉన్నాడని తెలుస్తోంది. కరీనా కపూర్ బుధవారం రాత్రి కరిష్మా కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్‌లతో కలిసి ఓ పార్టీకి వెళ్లింది.

కరీనా కపూర్ కూడా సోషల్ మీడియాలో పార్టీ ఫోటోను షేర్ చేసింది. దానికి ‘గర్ల్స్’ నైట్ ఇన్’ అని క్యాప్షన్ పెట్టింది. దీనిని బట్టి దాడి జరిగినప్పుడు ఆమె ఇంట్లో లేదని తెలుస్తోంది. ఒక వేళ ఇంట్లోనే ఉండి ఉంటే సైఫ్ తో పాటు కరీనాకు కూడా ముప్పు ఏర్పడి ఉండేది. కాగా గురువారం తెల్లవారుజామున సైఫ్ ఇంట్లో చోరీ యత్నం జరిగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ ఇల్లు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ముంబైలోని బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి తెల్లవారుజామున ఓ దొంగ ప్రవేశించాడు. అతడి రాకను గుర్తించిన ఇంటి పని మనుషులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ గొడవతో సైఫ్ అలీఖాన్ లేచి అక్కడికి చేరుకున్నాడు. ఆపై అడ్డుకునేందుకు వెళ్లిన సైఫ్‌పై దొంగ దాడి చేశాడు. దీంతో నటుడి వీపు భాగంతో పాటు ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డున పోయే వ్యక్తి ముక్కును కట్‌ చేసిన పతంగి మాంజా

అంతరిక్షంలో చైనా భారీ సోలార్ ప్రాజెక్ట్.. ఇది కనక పూర్తయితే..

గర్భవతులను చేయండి.. లక్షలు సంపాదించండి..!