Priyamani: బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Priyamani: బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Anil kumar poka

|

Updated on: Apr 18, 2024 | 10:03 AM

సినిమా ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ గురించి తరచుగా ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. చర్మం రంగు, శరీరం ఆధారంగా నటీమణులను విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు.. చాలా మంది హీరోయిన్స్ ఈ టైప్ బాడీ షేమింగ్ విమర్శలు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా వాడకం ఎక్కువైన దగ్గరనుంచి హీరోయిన్స్ గురించి సెలబ్రెటీల గురించి ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడ్డారు.

సినిమా ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ గురించి తరచుగా ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. చర్మం రంగు, శరీరం ఆధారంగా నటీమణులను విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు.. చాలా మంది హీరోయిన్స్ ఈ టైప్ బాడీ షేమింగ్ విమర్శలు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా వాడకం ఎక్కువైన దగ్గరనుంచి హీరోయిన్స్ గురించి సెలబ్రెటీల గురించి ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడ్డారు. తాజాగా ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి షాకింగ్ కామెంట్స్ చేసింది. జీరో సైజ్ సమస్యపై ఆమె మాట్లాడింది. బాలీవుడ్‌లో గ్లామర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే, మలయాళంతో సహా కొన్ని దక్షిణాది భాషలలో, గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీని గురించి ప్రియమణి మాట్లాడింది.

“బాగా కనిపించాలంటే ఏం చేయాలో అది చేయాలి. అది మీ వ్యక్తిగత ఎంపిక. నేను ఉన్న పరిశ్రమలో పోలికలు జరుగుతూనే ఉంటాయి. సౌత్ లో జీరో సైజ్‌ కావాలని ఎవరూ చెప్పలేదు. మన నటీమణులు ఈరోజు చాలా ఫిట్‌గా ఉన్నారు. వారు ఏమి తింటారు.? వారు ఎలా కనిపిస్తారు.? అనే దాని గురించి చాలా క్లారిటీతో ఉన్నారు. అయితే ఒకప్పుడు అంత క్లారిటీ ఉండే నటీమణులు చాలా తక్కువ. ఏది కావాలంటే అది తింటారు. ఇటీవల సైజ్ జీరో అంశం ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది” అని అన్నారు ప్రియమణి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!