Avantika Vandanapu: ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

Avantika Vandanapu: ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

Anil kumar poka

|

Updated on: Apr 18, 2024 | 9:43 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలనటిగా ఓ గుర్తింపు తెచ్చుకుంది అవంతిక వందనపు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మూవీతోపాటు పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన ఈ అమ్మాయి.. ఆ తర్వాత మరెక్కడ కనిపించలేదు. చాలాకాలం పాటు సైలెంట్ అయిన అవంతిక.. సడెన్‏గా హాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేక్షమయ్యింది. సైడ్ రోల్స్ కాకుండా ఏకంగా మెయిన్ లీడ్ రోల్ పోషించి తనదైన నటనతో హాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించినది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలనటిగా ఓ గుర్తింపు తెచ్చుకుంది అవంతిక వందనపు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మూవీతోపాటు పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన ఈ అమ్మాయి.. ఆ తర్వాత మరెక్కడ కనిపించలేదు. చాలాకాలం పాటు సైలెంట్ అయిన అవంతిక.. సడెన్‏గా హాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేక్షమయ్యింది. సైడ్ రోల్స్ కాకుండా ఏకంగా మెయిన్ లీడ్ రోల్ పోషించి తనదైన నటనతో హాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించినది. ఇటీవల ఆమె నటించిన మీన్ గర్ల్ సినిమాతో అమెరికాలో సూపర్ హిట్ అయ్యింది. ఇందులో అవంతిక వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ రోల్ పోషించింది. ఈ మూవీతో అటు సోషల్ మీడియాలోనూ సెన్సెషన్ అయ్యింది. తెలుగమ్మాయి హాలీవుడ్ సినిమాల్లో నటించడం.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో అవంతిక మాట్లాడిన అమెరికన్ యాక్సెంట్ బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతున్న యాక్సెంట్ పై తెగ ట్రోల్స్ అయ్యాయి.

అయితే కొద్దిరోజుల క్రితం తన యాక్సెంట్ పై జరుగుతున్న ట్రోలింగ్ గురించి మాట్లాడింది అవంతిక. తనదైన శైలీలో ట్రోలర్లకు గట్టిగానే కౌంటరిచ్చింది. ఇక ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అవంతికకు ఇప్పుడు ప్రఖ్యత హార్వర్డ్ యూనివర్సిటీ ఓ ప్రతిష్టాత్మక అవార్డుని అందించింది. అమెరికాలో ఉన్న టాప్ యూనివర్సిటీ అయిన హార్వర్డ్ ఇప్పుడు అవంతికకు సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందించింది. ఏప్రిల్ 15న అవంతిక ఈ అవార్డ్ అందుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!