Sai Dharam Tej: హీరో అత్యుత్సాహం.. కాళహస్తి ఆలయంలో అపశ్రుతి.. బ్రో ప్రమోషన్స్ లో తేజ్.

|

Jul 16, 2023 | 9:54 AM

విరూపాక్ష సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టి.. తన మామ బ్రో సినిమాతో అతి తొందర్లో మన ముందుకు వస్తున్న సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ..తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. తెలుగు టూ స్టేట్స్‌లో వన్‌ ఆఫ్ ది పుణ్య క్షేత్రమైన శ్రీకాళహస్తిలో.. కాస్త తొందరపడి.. వేద పండితుల ఆగ్రహానికి లోనయ్యారు.

విరూపాక్ష సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టి.. తన మామ బ్రో సినిమాతో అతి తొందర్లో మన ముందుకు వస్తున్న సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ..తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. తెలుగు టూ స్టేట్స్‌లో వన్‌ ఆఫ్ ది పుణ్య క్షేత్రమైన శ్రీకాళహస్తిలో.. కాస్త తొందరపడి.. వేద పండితుల ఆగ్రహానికి లోనయ్యారు. కాళహస్తి సుబ్రమణ్య స్వామి భక్తులకు కూడా కోసం తెప్పించారు. ఎస్ ! నిన్న మొన్నటి వరకు బ్రో షూటింగ్‌లో కాస్త బిజీగా ఉన్న సాయి ధరమ్ తేజ్‌.. ఆ సినిమా షూట్ను ఫినిష్ చేసుకుని.. తాజాగా శ్రీకాళహస్తి సుబ్రమణ్య స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు. కానీ ఈ క్రమంలోనే స్వామి వారికి తనే హారితిచ్చారు. వివాదంలో చిక్కుకున్నారు.

అయితే ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం స్వామి వారికి పండితులు తప్ప భక్తులెవరూ హారతి ఇవ్వకూడదు. కాని హీరో సాయిధరమ్ తేజ్‌ మాత్రం పూజా సమయంలో స్వామి వారికి తనే స్వయంగా హారతి ఇచ్చారు. అయితే ఇది హీరో అత్యుత్సాహం వల్ల జరిగిందో.. లేక ఆలయ పురోహితుల నిర్లక్ష్యం వల్ల జరిగిందో తెలీదు కానీ.. ఇదే ఇప్పుడు వేద పండితులకు.. భక్తులకు ఆగ్రహం తెప్పిస్తోంది. స్వామి వారి ఆలయంలో.. ఇలాంటి అపశ్రుతులకు ఆస్కారం ఇవ్వకుండా.. చూడాలనే మాట వినిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...