Nikhil siddharth: తీసుకోమన్నారు కానీ.. నేను డ్రగ్స్ తీసుకోలేదు..! నిఖిల్ షాకింగ్ కామెంట్స్..
కార్తీకేయ2 సూపర్ డూపర్ హిట్‌తో .. పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన నిఖిల్.. తొందర్లో స్పైగా మన ముందుకు వస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో.. మరో పాన్ ఇండియన్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌తో.. మంచి అంచనాలను
కార్తీకేయ2 సూపర్ డూపర్ హిట్‌తో .. పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన నిఖిల్.. తొందర్లో స్పైగా మన ముందుకు వస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో.. మరో పాన్ ఇండియన్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌తో.. మంచి అంచనాలను కూడా పెంచేసుకుని.. ఈ మూవీ ప్రమోషన్‌ను పరిగెత్తిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే.. టాలీవుడ్‌లో డ్రగ్స్ భూతం మరో సారి తెరపైకొచ్చిన నేపథ్యంలో.. డ్రగ్స్ పై వైరల్ కామెంట్స్ చేశారు నిఖిల్. ఎస్ ! హైదరబాద్‌లో డ్రగ్స్ నివారణపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు.. ప్రియదర్శితో కలిసి గెస్ట్‌గా వెళ్లిన నిఖిల్.. డ్రగ్స్‌కు అందరూ దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు అలవాటుపడితే అదే మరణశిక్ష అవుతుందని అన్నారు. పార్టీలకు వెళ్లండి కానీ డ్రగ్స్ తీసుకోకండి యంగ్ స్టర్స్‌కు సూచించారు. త్వరలో డ్రగ్ ఫ్రీగా స్టేట్‌గా.. తెలంగాణ మారాలని ఆకాక్షించారు. ఇక దాంతో పాటే.. తనకు చాలా సార్లు డ్రగ్స్ తీసుకోమని ఆఫర్లు వచ్చాయంటూ.. అందర్నీ షాకయ్యేలా చేశారు నిఖిల్. కానీ తానెప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని వాటికి దూరంగా ఉంటూ వచ్చానని చెప్పి..ఆ మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ నయా పాన్ ఇండియన్ హీరో.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..