Manchu Manoj: ఆసుపత్రిలో మనోజ్.! మంచు కుటుంబంలో తుఫాన్.. మోహన్‌బాబు తనను కొట్టారని..

|

Dec 08, 2024 | 10:31 PM

మంచు ఫ్యామిలీలో తుఫాన్‌ రేగింది. బాప్‌ ఔర్‌ బేటా- మధ్య కొట్లాట పోలీస్‌ స్టేషన్‌దాకా వెళ్లింది. తండ్రి తనను కొట్టాడంటా కొడుకు.. కొడుకే తనను కొట్టాడంటూ తండ్రి పోలీసులకు చెప్పారు. మోహన్‌బాబు, ఆయన కొడుకు మంచు మనోజ్‌ మధ్య వివాదం సండేనాడు మరో మలుపు తిరిగింది. తొలుత డయల్‌ హండ్రెడ్‌ ద్వారా మంచు మనోజ్‌- పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన తండ్రి తనను కొట్టారంటూ ఇంటికొచ్చిన పోలీసులకు మంచు మనోజ్‌ ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న పోలీసులకు మోహన్‌బాబు కూడా ఫిర్యాదు చేశారు. తనపై మనోజ్‌ దాడిచేశారని మోహన్‌బాబు ఆరోపించారు. ఆస్తి కోసం తన కొడుకు తనను కొట్టాడని పోలీసులకు చెప్పారాయన. అంతేగాకుండా, తన భార్యపై కూడా మనోజ్‌ దాడిచేసినట్లు మోహన్‌బాబు వాపోయారు. అయితే, అటు మనోజ్‌ గానీ, ఇటు మోహన్‌బాబు గానీ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. ఈ పరస్పర ఫిర్యాదులు కేవలం మౌఖికంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.