2025లో గూగుల్‌లో ఎక్కువ ఎవరికోసం సెర్చ్ చేసారో తెలుసా ??
2025 గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోలలో అగ్రస్థానంలో నిలిచారు. 'పుష్ప-2' విజయం, 'AA22' వంటి భారీ ప్రాజెక్టులపై అంచనాలు దీనికి కారణం. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అల్లు అర్జున్ పాన్-ఇండియా క్రేజ్, రాబోయే సినిమాలు అతని హవాను కొనసాగించనున్నాయి.
ఇక ఐదే రోజుల్లో 2025 సంవత్సరం ముగిసిపోతుంది. కొత్త ఏడాదికి వెల్‌కమ్‌చెప్పడానికి, 2025కి వీడ్కోలు చెప్పేందుకు సన్నాహాల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. 2025లో గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఏ హీరోపై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపారనే ప్రశ్నకు సమాధానంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. 2025లో గూగుల్‌లో అత్యధికంగా వెతకబడిన టాలీవుడ్ నటుడిగా బన్నీ అగ్రస్థానంలో నిలిచారు. 2024 చివరిలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో ఆయన పేరు ఈ ఏడాది పొడవునా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ఘనవిజయంతో పాటు తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న ‘ఏఏ22’ ప్రాజెక్ట్‌పై ఉన్న భారీ అంచనాలు కూడా బన్నీ టాప్ ప్లేస్‌లో నిలవడానికి దోహదపడ్డాయి. ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. డిసెంబరు 24 నాటి గూగుల్ డేటా ప్రకారం టాప్-5 జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉండగా, ప్రభాస్ రెండో స్థానంలో నిలిచారు. వారి తర్వాత వరుసగా మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా, అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో నాలుగోసారి కలిసి పనిచేయబోతున్నారు. పాన్-ఇండియా స్థాయిలో పెరుగుతున్న క్రేజ్, బలమైన లైనప్‌తో టాలీవుడ్‌లో అల్లు అర్జున్ హవా మరికొంత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: