Golden Visa – Chiranjeevi: చిరంజీవికి గోల్డెన్‌ వీసా.. దీని ప్రత్యేకతలు ఇవే..

|

May 30, 2024 | 10:05 PM

పద్మవిభూషణ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ గోల్డెన్‌ వీసా ను ఆయన అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి UAE ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్‌లో మెగాస్టార్ కూడా చేరారు. దీంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన..

పద్మవిభూషణ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ గోల్డెన్‌ వీసా ను ఆయన అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి UAE ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్‌లో మెగాస్టార్ కూడా చేరారు. దీంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు పదేళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఇంతకుముందు.. చిత్ర పరిశ్రమకు చెందిన రజనీకాంత్, షారుక్‌ ఖాన్‌, అల్లు అర్జున్‌, దుల్కర్‌ సల్మాన్‌, త్రిష,కాజల్‌ తదితరులు ఈ వీసా అందుకున్నారు. ఇక సినిమాల విషయాకొస్తే.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర లో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని రూ.200 కోట్లతో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.