Ram Charan - Rajkumar Hirani: ఇంట్రెస్టింగ్ న్యూస్.. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఫిల్మ్‌లో చరణ్‌.

Ram Charan – Rajkumar Hirani: ఇంట్రెస్టింగ్ న్యూస్.. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఫిల్మ్‌లో చరణ్‌.

Anil kumar poka

|

Updated on: Oct 06, 2023 | 11:29 AM

ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్‌తో.. గ్లోబల్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. బాలీవుడ్ మేకర్స్ నుంచి వరుసగా ఛాన్స్‌లు వచ్చేలా చేసుకుంటున్నారు. టీ సీరస్‌, కరణ్ లాంటి బిగ్ బీ టౌన్‌ ప్రొడ్యూసర్స్‌ చెర్రీతో సినిమాలు తీయాలని చూస్తూ .. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవేమీ పట్టించుకోని చరణ్‌.. నిన్న మొన్నటి వరకు గేమ్ చేంజర్‌ మూవీ మీదే ఫోకస్ చేశారు.

ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్‌తో.. గ్లోబల్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. బాలీవుడ్ మేకర్స్ నుంచి వరుసగా ఛాన్స్‌లు వచ్చేలా చేసుకుంటున్నారు. టీ సీరస్‌, కరణ్ లాంటి బిగ్ బీ టౌన్‌ ప్రొడ్యూసర్స్‌ చెర్రీతో సినిమాలు తీయాలని చూస్తూ .. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవేమీ పట్టించుకోని చరణ్‌.. నిన్న మొన్నటి వరకు గేమ్ చేంజర్‌ మూవీ మీదే ఫోకస్ చేశారు. నెక్ట్స్‌ బుచ్చి బాబు సనా డైరెక్షన్లో మరో సినిమా చేసుందుకు రెడీ కూడా అవుతున్నారు. ఇక ఈక్రమంలోనే ఓ క్రేజీ న్యూస్ బయటికి రావడంతో.. ఇప్పడు బీ టౌన్‌లో విపరీతంగా బజ్‌ చేస్తున్నారు మన మెగా పవర్ స్టార్. ఎప్పుడూ టాలీవుడ్లోనే బిజీగా ఉండే మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌.. ఉన్నట్టుండి ముంబై బాట పట్టారు. అక్కడే ఉన్న సిద్ది వినాయక టెంపుల్‌లో.. తను ధరించిన అయ్యప్ప మాలను తీసి మరీ… బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌ కుమార్‌ హిరాణీని మీట్ అయ్యారు. చాలా డిష్కషన్స్ తర్వాత… ఆయన ఆఫీస్‌ నుంచి.. ఓ యాడ్‌ షూట్‌కు వెళ్లారు. అయితే చెర్రీ రాజ్‌ కుమార్‌ హిరాణీ మీటింగ్‌ను క్రాక్ చేసిన బాలీవుడ్ మీడియా.. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రానుందంటూ.. కన్ఫర్మ్ చేస్తూ న్యూసులు రాస్తున్నారు. హరాణీ తన నెక్ట్స్‌ సినిమా కోసం చెర్రీని హీరోగా అనుకున్నారని.. అందుకోసమే ఆయనకు స్టోరీ నరేట్ చేశారని అంటున్నారు. చెర్రీ కూడా.. దాదాపు ఓకే చెప్పినట్టే అంటూ.. తమ న్యూసుల్లో కోట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్‌ లోనే కాదు.. ఇండియన్ సినిమాస్ దగ్గర వన్‌ ఆఫ్ ది ట్యాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరున్న హిరీణీ.. ఎట్ ప్రజెంట్ షారుఖ్ డంకీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తరువాత చెర్రీ హీరోగా నెక్ట్స్‌ సినిమాను మొదలెట్టనున్నారటనే టాక్ తో బీటౌన్‌లో బజ్ కూడా చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..