ప్లాప్స్ వస్తే గానీ.. మార్పు రాలేదన్నమాట వీడియో
సినిమా ఫ్లాప్‌లు తెలుగు హీరోల కెరీర్‌లలో కీలక మార్పులకు దారితీశాయి. సిద్దు జొన్నలగడ్డ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి వంటి నటులు తమ పాత జోనర్‌లకు తిరిగి వస్తున్నారు లేదా కొత్త కథలను ఎంచుకుంటున్నారు. ఇది కేవలం భయంతో కాదు, కొత్తదనం కోరుకునే ప్రయత్నంగా కూడా ఉంది. ఈ మార్పులు వారి రాబోయే చిత్రాలపై ఆసక్తిని పెంచుతున్నాయి.
స్వీయ అనుభవం గొప్ప గుణపాఠం అని చెప్పడంలో సందేహం లేదు. టాలీవుడ్ హీరోల విషయంలో ఇది ప్రస్తుతం నిజమవుతోంది. వరుస పరాజయాలు వారి కెరీర్ లో కీలక మార్పులకు దారితీశాయి. కొందరు నటులు కొత్తదనం కోసం ఈ మార్పును కోరుకుంటే, మరికొందరు ఫ్లాప్‌ల భయంతో తమ అడుగులను మార్చుకుంటున్నారు. డీజే టిల్లుతో స్టార్ బాయ్ గా మారిన సిద్దు జొన్నలగడ్డ, ఆ తర్వాత జాక్, తెలుసు కదా చిత్రాలతో నిరాశపరిచాడు. దీంతో తన కెరీర్ మొదట్లో సక్సెస్ ఇచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ ఆర్ఎస్జె స్వరూప్ తో సీతార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకు సిద్ధమయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :
