బయటికొస్తే బంతాటే.. సెలబ్రిటీస్‌కు ఈ తిప్పలేంటి
సినిమా తారలు పబ్లిక్ ఈవెంట్స్‌కు వస్తే అభిమానుల మితిమీరిన ప్రవర్తన పెను సవాలుగా మారుతోంది. సమంత, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లకు భద్రత కరువవుతోంది. అభిమానం పేరుతో ఆకతాయిలు చేసే అరాచకం సెలబ్రిటీలకు ఇబ్బందులు సృష్టిస్తోంది. క్రౌడ్ కంట్రోల్ వైఫల్యం, ఆర్గనైజర్ల లోపాలపై ప్రశ్నలు రేగుతున్నాయి. ఈవెంట్లలో తారల భద్రతకు పరిష్కారం ఏమిటి?
సినిమా వాళ్లు పబ్లిక్ ఈవెంట్స్‌కు రావడం ఇకపై కష్టమేనా..? వాళ్లు బయటికి వస్తే మీద పడిపోతున్నారా…? అభిమానం పేరుతో అరాచకం చేస్తున్నారా..? హద్దుల్లో ఉండాల్సిన అభిమానులే.. మితిమీరి ప్రవర్తిస్తున్నారా..? ఇది ఎవరి వైఫల్యం..? పబ్లిసిటీ కోసం ఈవెంట్ ఆర్గనైజర్లే ఇలా చేస్తున్నారా..? లేదంటే నిజంగానే పరిస్థితి అదుపు తప్పుతుందా..? మామూలుగానే సినిమా వాళ్లు బయట కనిపిస్తే ఆ క్రౌడ్ కంట్రోల్ చేయడం కష్టం.. చిన్న ఆర్టిస్ట్స్ వచ్చినపుడే మీద పడిపోతూ ఉంటారు.. అలాంటిది స్టార్స్ బయటికి వస్తే హ్యాండిల్ చేయడం కష్టమే. సరిగ్గా ఈ విషయంలోనే ప్రతీసారి బుక్ అయిపోతున్నారు సెలబ్రెటీలు.. ముఖ్యంగా హీరోయిన్లు బయటికి వచ్చినపుడు వాళ్ళకు రక్షణ కరువవుతుంది. తాజాగా హైదబరాద్‌లో ఓ షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన సమంతకు చుక్కలు కనిపించాయి. లోపలికి వచ్చేటప్పుడు.. బయటికి వెళ్లేటప్పుడు అభిమానుల తాకిడి మామూలుగా లేదు. ఎంతో కష్టపడి ఆమెను అక్కడ్నంచి పంపారు కానీ.. ఈ గ్యాప్‌లోనే సమంతతో కొందరు ఆకతాయిలు దురుసుగా ప్రవర్తించారు. మొన్న రాజా సాబ్ సాంగ్ లాంఛ్‌లో నిధి అగర్వాల్‌కు ఇలాంటి కష్టాలే ఎదురయ్యాయి. నిధి అగర్వాల్‌తో మిస్ బిహేవ్ చేసిన వీడియోలు బయటికి వచ్చిన తర్వాత పోలీసులు సైతం రంగంలోకి దిగారు. పబ్లిక్ ఈవెంట్లలో అభిమానుల అతి ప్రవర్తనపై సీరియస్ అయ్యారు. ఈ విషయంపై నిధి సైతం ఆర్గనైజర్లనే తప్పు బట్టారు. అదే ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కు సైతం చుక్కలు చూపించారు ఫ్యాన్స్. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. వీరసింహారెడ్డి హీరోయిన్ హనీ రోజ్ ఓ ఈవెంట్‌కు వెళ్లినపుడు ఆకతాయిలు నరకం చూపించారు. అలాగే మొన్నటికి మొన్న బాలీవుడ్ హీరోయిన్స్ కృతి సనన్, జాన్వీ కపూర్ విషయంలోనూ ఇదే జరిగింది. ప్రియాంక చోప్రా అయితే కోపం తట్టుకోలేక కొట్టేసింది కూడా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
రైలు ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
