S.S. Rajamouli: నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్ లో..

|

Aug 08, 2024 | 8:08 PM

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి జీవిత కథ పై మోడ్రన్ మాస్టర్స్ పేరుతో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. గత వారం స్ట్రీమింగ్ కు వచ్చేసిన మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో నిలిచింది. టాప్‌లో దూసుకుపోతోంది. ఇక బాలీవుడ్ లో పలు సినిమాలు, చాలా టీవీ షోలు నిర్మించిన సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, ఫిలిం కంపానియన్ స్టూడియోస్

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి జీవిత కథ పై మోడ్రన్ మాస్టర్స్ పేరుతో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. గత వారం స్ట్రీమింగ్ కు వచ్చేసిన మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో నిలిచింది. టాప్‌లో దూసుకుపోతోంది.

ఇక బాలీవుడ్ లో పలు సినిమాలు, చాలా టీవీ షోలు నిర్మించిన సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, ఫిలిం కంపానియన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థలు కలిసి సంయుక్తంగా రాజమౌళి డాక్యుమెంటరీని తెరకెక్కించింది. రాఘవ్ కన్నా ఈ డాక్యూమెంటరీకి దర్శకత్వం వహించారు. ఇక ఈ మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీలో రాజమౌళి జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు, విశేషాలు చాలా ఉన్నాయి. బాల్యం నుండి నేటి వరకు ఆయన ప్రయాణం గురించి ‘మోడరన్ మాస్టర్స్’ డాక్యుమెంటరీ చూపిస్తోంది. రాజమౌళి బాల్యం, ప్రేమ, పెళ్లి గురించి, రాజమౌళి కెరీర్ ఆరంభం, ఆ తర్వాత రాజమౌళి సినిమాల గురించి ఈ డాక్యుమెంటరీలో చర్చించారు రాజమౌళితో పాటు.. ఆయన నియర్ అండ్ డియర్స్.అంతేకాదు హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, జో రసో.. ఇలా అనేకమంది టాప్ సెలబ్రిటీలు రాజమౌళి గురించి పలు ఆసక్తికర విషయాలను ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.