Venkatesh – Chiranjeevi: స్టోరీ బాగా నచ్చడంతో వెంకటేష్ సినిమాను లాక్కున్న చిరు.!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘అంజి’. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరు నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను శ్యామ్ ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎంఎస్ ఆర్ట్స్ యూనిట్ ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే సిద్ధం చేయగా.. పి. సత్యానంద్ మాటలు రాశాడు. 1998లో ప్రారంభమైన ఈ సినిమా దాదాపు ఆరేళ్లపాటు నిర్మాణం జరుపుకుని మొత్తానికి 2004లో విడుదలైంది. అయితే కమర్షియల్‌గా అంతగా విజయం సాధించకపోయినప్పటికీ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ పురస్కారం అందుకుంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘అంజి’. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరు నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను శ్యామ్ ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎంఎస్ ఆర్ట్స్ యూనిట్ ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే సిద్ధం చేయగా.. పి. సత్యానంద్ మాటలు రాశాడు. 1998లో ప్రారంభమైన ఈ సినిమా దాదాపు ఆరేళ్లపాటు నిర్మాణం జరుపుకుని మొత్తానికి 2004లో విడుదలైంది. అయితే కమర్షియల్‌గా అంతగా విజయం సాధించకపోయినప్పటికీ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ పురస్కారం అందుకుంది. అంతేకాకుండా కెమెరా, మేకప్ విభాగాల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు సొంతం చేసుకుంది. అప్పట్లోనే ఈ సినిమా గ్రాఫిక్స్ వేరేలెవల్లో ఉన్నాయి. ఇక క్లైమాక్స్ గురించి చెప్పక్కర్లేదు. అడియన్స్ కళ్లను మాయ చేసి.. గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. ఇందులో చిరు, నాగబాబు కలిసి నటించారు.
2004లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజానికి ఈ సినిమా కథను కోడి రామకృష్ణ సిద్దం చేసుకుని ముందుగా విక్టరీ వెంకటేష్ తో చేయాలని డిసైడ్ అయ్యారట. వెంకీకి కథ చెప్పడం.. అతను ఒకే చేయడం జరిగిపోయింది. అయితే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిరంజీవిని కలిసినప్పుడు అంజి సినిమా గురించి చెప్పి కథ నేరేట్ చేశారట. చిరంజీవికి కథ బాగా నచ్చడంతో నేను చేస్తానని అన్నారట. దీంతో వెంకీతో అనుకున్న సినిమా కాస్తా చిరంజీవి చేతుల్లోకి వెళ్లింది. అప్పటికే వెంకీతో కోడి రామకృష్ణ దేవిపుత్రుడు సినిమా చేశారు. అందులో సౌందర్య కథానాయికగా నటించింది. అప్పట్లో ఈమూవీలోనూ అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్స్‌తో ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos