అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.. రవితేజ వాళ్లకు దిమ్మతిరిగేలా చేశాడు
సినిమాలను ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తేనే స్టార్ హీరోలవుతారనే టాక్ ఉంది ఇండస్ట్రీలో.. ! అందుకే తమకు ఏదైనా కథ నచ్చితే.. పట్టుబట్టి మరీ హోల్డ్ చేస్తుంటారు స్టార్ హీరోలు. డేట్స్ లేకున్నా భారీగా అడ్వాన్స్‌లు ఇచ్చి మరీ డైరెక్టర్లను తమ దగ్గరే పెట్టకుంటారు. కానీ కెరీర్లో అప్పుడప్పుడే ఎదిగే హీరోలు మాత్రం మంచి కథలను మిస్ చేసుకుంటారు.
అలా ఇప్పటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ ఇప్పటి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ .. ఈ ఇద్దరూ ఓ క్రేజీ సినిమాను మిస్ చేసుకున్నారు. కానీ అదే అవకాశాన్ని ఒడిసిపట్టిన రవితేజ.. మాస్ రాజా గా మారిపోయాడు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యారు అల్లు అర్జున్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత బన్నీకి అనేక అవకాశాలు వచ్చాయట. అందులో భద్ర ఒకటి. డైరెక్టర్ బోయపాటి శ్రీను భద్ర కథను ముందుగా అల్లు అర్జున్ కు చెప్పారట. కానీ అప్పటికే బన్నీ మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయారట. ఆ తర్వాత అదే కథను ఎన్టీఆర్ కు చెప్పారట. కానీ కథ వింటూనే భయపడ్డారట. ఆయన కథ చెప్పే విధానమే తనను భయపెట్టిందని.. అందుకే ఆ సినిమాను వదులుకున్నానని గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఇదే భద్ర కథను రవితేజకు చెప్పగా.. వెంటనే అంగీకరించారట. అలా భద్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రవితేజ. టాలీవుడ్‌లో స్టార్ అయిపోయాడు. ఇక బోయపాటి కూడా ఈసినిమా సక్సెస్‌తో టాలీవుడ్‌లో సెన్సబుల్ డైరెక్టర్ అయిపోయాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాడ్ లక్! ఆ హీరో వద్దన్నాడు.. నితిన్ ఏమో ఎదురపోయి చేశాడు
రిస్క్ చేసిన కుబేర ప్రొడ్యూసర్ తేడా వస్తే.. కోలుకోలేని దెబ్బే
Heart Attack: ఆకస్మిక గుండెపోట్లకు అధిక శాతం కారణం అదేనట
సైక్లింగ్ మంచిదా.. రన్నింగ్ మంచిదా.. విస్తు పోయే నిజాలు
ప్రియురాలి కరివేపాకు కోరిక తీర్చేందుకు.. దేశాలు దాటి వచ్చిన ప్రియుడు..!