Sujitha Dhanush: మనం అనుకున్నట్టు జరగదు.. మా అన్న జీవితమూ అంతే.!: సుజిత ధనుష్.

Updated on: Mar 22, 2024 | 11:31 AM

డైరెక్టర్ సూర్య కిరణ్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన అనారోగ్య సమస్యతో తుదిశ్వాస విడిచారు. సూర్య కిరణ్ మరణంపై ఆయన సోదరి సుజిత ధనుష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన అన్నయ్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ తాజాగా తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సూర్య కిరణ్ తనకు అన్న మాత్రమే కాదని.. నాన్న.. సూపర్ హీరో అని..

డైరెక్టర్ సూర్య కిరణ్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన అనారోగ్య సమస్యతో తుదిశ్వాస విడిచారు. సూర్య కిరణ్ మరణంపై ఆయన సోదరి సుజిత ధనుష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన అన్నయ్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ తాజాగా తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సూర్య కిరణ్ తనకు అన్న మాత్రమే కాదని.. నాన్న.. సూపర్ హీరో అని.. మరో జన్మంటూ ఉంటే తన అన్న కన్న కలలు నిజమవ్వాలని కోరుకుంటున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు సుజాత. దాంతో పాటే మరో వీడియోను కూడా పోస్ట్ చేసి.. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైలర్ అవుతున్నారు ఈమె. ఆ వీడియోలో ఓ బస్సులో ప్రయాణిస్తున్న ఓ పెద్దావిడ.. ఆ పెద్దావిడతో పాటే.. ప్రయాణం చేస్తున్న మరో అమ్మాయి కథను చెబుతూ.. మనది చిన్న ప్రయాణం.. ఈ జర్నీ ఎప్పుడు ముగుస్తుందో.. ఎక్కడ ముగుస్తుందో తెలియదు.. అలాంటి ఈ చిన్న జీవితంలో ఏవో చిన్న చిన్న కారణాలకు.. కోపాలకు పోయి మాటలు అనడం అనవసరం. లేదా ఎవరో మనల్ని బాధపెడుతున్నారని ఫీల్ అవ్వడం వృథా అనే సందేశాన్ని తన ఫ్యాన్స్‌కు వివరించారు సుజాత. మనది చాలా చిన్న ప్రయాణం.. ఉన్నంతకాలం ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్ధాం అంటే.. అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Mar 22, 2024 11:31 AM