Loading video

ధనుష్‌ అలా మాట్లాడేసరికి షాకయ్యా

|

Jan 24, 2025 | 2:06 PM

స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా.. తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా రాయన్ సినిమాతో.. మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో.. నెక్స్ట్ శేఖర్ కమ్ముల కుబేర సినిమాతో.. ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో ధనుష్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు శేఖర్ కమ్ముల. ధనుష్‌ మాటలకు తాను షాకయ్యా అంటూ చెప్పారు. కుబేర కథ రాసుకున్న తర్వాత ముందుగా ధనుష్ కి కథ చెప్పాలని.. ఆయన ఈ సినిమా చేస్తే బాగుంటుందని శేఖర్ కమ్ముల అనుకున్నారట. కానీ ధనుష్ తో పరిచయం లేకపోవడంతో.. ఆయనతో ఎలా మాట్లాడాలి అని ఆలోచించారట. ధనుష్‌కి ఫోన్ చేసి ఫోన్‌లో ముందుగా తనను తాను పరిచయం చేసుకుని ఆ తర్వాత తన సినిమా గురించి చెప్పాలనుకున్నాడట. కానీ తాను కాల్ చేసి.. శేఖర్ కమ్ముల అని చెప్పగానే.. ధనుష్‌ తన సినిమాల గురించి మాట్లాడడం మొదలెట్టాడట. తన వర్క్‌ను డైరెక్షన్ ను అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాడట. దీంతో శేఖర్ కమ్ముల ఒక్కసారిగా షాకయ్యారట. ఇక ఇదే విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కుబేర సినిమాను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.30 కోట్ల బడ్జెట్! రూ.100 కోట్ల కలెక్షన్స్‌! ఈ హిట్ సినిమా OTTలో…

Prabhas: వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న డార్లింగ్.. మళ్లీ మారిన ప్రభాస్ లైనప్‌

RGV: ఆర్జీవీకి బిగ్‌ షాక్‌.. 3 నెలల జైలు శిక్ష

Balakrishna: బాలయ్య పాట పాడితే.. ఎవరైనా చిందులేయాల్సిందే..

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై మరోసారి సీఎం రేవంత్ కామెంట్స్