ఒక్క మాటతో.. ఇండియన్ 3పై అంచనాలు.. అదీ శంకర్ కాన్ఫిడెంట్
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పనుల్లో బిజీగా ఉన్న డైరెక్టర్ శంకర్.. డల్లాస్ లో జరిగిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో.. తన అప్‌కమింగ్ సినిమా ఇండియన్ 2 గురించి మాట్లాడాడు. ఈ సినిమా పై నెట్టింట వైరల్ అవుతున్న ఓ న్యూస్ పై క్లారిటీ కూడా ఇచ్చాడు. కమల్ హీరోగా... శంకర్ డైరెక్షన్లో 1996లో తెరకెక్కిన ఫిల్మ్ ఇండియన్.
ఎన్నో అంచనాల మధ్య అప్పట్లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. డైరెక్టర్ శంకర్‌ను స్టార్‌ను చేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా.. ఇండియన్ 2 సినిమా తెరకెక్కింది. అయితే ఇటీవల రిలీజ్ అయిన ఈసినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా వస్తున్న ఇండియన్ 3 సినిమా థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుందనే న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్త అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ తెగ వైరల్ అవుతోంది. ఇక ఈక్రమంలోనే గేమ్ ఛేంజర్ ఈవెంట్ వేదికగా ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చాడు శంకర్. ఇండియన్ 2 చిత్రానికి ఇంత నెగిటివ్ రివ్యూలు వస్తాయని అసలు అనుకోలేదు. అందుకే గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పిన శంకర్.. ఇండియన్3 ముందుగా థియేటర్లలో రిలీజ్ అవుతుందంటూ చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెంకీ తొడగొడితే.. బాలయ్య ఆసనం వేశాడు.. నవ్వులే.. నవ్వులు..
రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశా.. అందుకు కారణం ఒకటే !!
అల్లు అర్జున్ నా బిడ్డ చికిత్సకయ్యే ఖర్చులను చూసుకుంటున్నాడు..