RGV on Pushpa 2: అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. ఏదో ఒక కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా అవుతారు.?
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘పుష్ప2’ చిత్రం, అల్లు అర్జున్ పాత్రపై తనదైన స్టైల్‌లో రివ్యూ ఇచ్చారు. భారతీయ సినిమాల్లో పదునైన పాత్రలు చాలా అరుదుగా వస్తాయని, పుష్పరాజ్‌లాంటి పాత్రలో నటించి ఆకట్టుకోవడం అంత సామాన్యమైన విషయం కాదని అన్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, అల్లు అర్జున్ నటనపై తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేసారు.
భారతీయ సినిమాల్లో బలమైన, పదునైన పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి. అంతకుమించిన మరొక విషయం ఏంటంటే, ఒక స్టార్ హీరో తన ఇమేజ్‌ను కూడా పక్కకు పెట్టి, ఇలాంటి పాత్రలో నటించడం ఇంకా అరుదని ఆర్జీవీ రాసుకొచ్చారు. ‘పుష్పరాజ్’ పాత్రలు రావడం చాలా చాలా అరుదు. సినిమా చూస్తున్నప్పుడు వాస్తవ ప్రపంచంలో పుష్పలాంటి పాత్ర ఉంటుందని ఒక సగటు ప్రేక్షకుడిగా నాకూ అనిపించింది. కమర్షియల్ హంగులున్న సినిమాలో నిజంగా అలాంటి పాత్రను చూపించడం అంత సులభమైన విషయం కాదు. పుష్ప పాత్ర అనేది అనేక వైరుధ్యాలతో కూడుకుంది. అమాయకత్వం, ఎదుటి వారిని మోసం చేసే తెలివితేటలు, తారస్థాయిలో ఉండే అహం ఇలా అన్నీ కలగలిపి ఉంటాయి’’
‘‘వైకల్యం కలిగిన ఒక వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే సూపర్ హీరోకు ఉండే నిర్వచనం వేరు. దాని ప్రకారం సూపర్ హీరో అన్నింటిలోనూ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. కానీ, పుష్ప క్యారెక్టర్‌లో నటించిన అల్లు అర్జున్ సూపర్‌హీరోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. మునుపెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ ఆ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయి. సినిమా చరిత్రలో, ప్రేక్షకుల మదిలో దశాబ్దాల పాటు పుష్పరాజ్ పాత్ర ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. తన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో అల్లు అర్జున్ జీవించాడు. సీఎం తనతో ఫొటో దిగడానికి ఆసక్తి చూపించనప్పుడు.. తన అహాన్ని చంపుకొని భన్వర్‌సింగ్‌కు సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు విపరీతంగా మద్యం తాగడం వంటి ఎమోషనల్ సన్నివేశాల ద్వారా అల్లు అర్జున్ ఆ పాత్రకు ప్రాణం పోశారు. కేవలం అతడి హావభావాలే కాదు, బలమైన భావోద్వేగాలు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. ఈ విషయాన్ని చెప్పినందుకు క్షమించండి కానీ, ‘పుష్ప2’ ఈ జర్నీని ఆస్వాదించాక ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ‘పుష్పరాజ్’ పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా తక్కువే అనిపించాడు’’ అని రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.