Atlee: కలర్ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న కపిల్..
దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ మారాడు అట్లీ. ప్రస్తుతం ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న బేబీ జాన్ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో చిత్రయూనిట్ తో కలిసి పాల్గొన్నారు అట్లీ.
ఒక షోలో అట్లీ లుక్స్ అవమానిస్తూ మాట్లాడాడు కపిల్. తన రంగు పై పంచేశాడు. దీంతో ఆయన ఉద్దేశ్యాన్ని గమనించిన అట్లీ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. కపిల్ శర్మ వేసిన పంచ్ అర్థం అయిందని చెప్పిన అట్లీ.. తన మొదటి సినిమా నిర్మించిన ఏఆర్ మురుగదాస్ కు తాను కృతజ్ఞతలు చెప్పాలన్నాడు. అతడు తన స్క్రిప్ట్ చూశాడు కానీ.. తాను ఎలా ఉన్నాను.. అనేది చూడలేదంటూ చెప్పాడు. అంతేకాదు ప్రపంచం మనలో ఉన్న టాలెంట్ చూడాలి. మనం ఎలా ఉన్నది కాదు. రూపాన్ని బట్టి మనిషిని కాదు అంటూ కపిల్ శర్మకు గట్టిగానే కౌంటరిచ్చాడు అట్లీ. దీంతో ఇప్పుడు కపిల్ శర్మ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.