Dill Raju Shocking Comments: ప్రాబ్లమ్ వాళ్లది.. వాళ్లే నా దగ్గరకు రావాలి..! దిల్ రాజ్ షాకింగ్ కామెంట్స్..
దిల్ రాజు! ఆయన పట్టిందల్లా బంగారం అంటారు. సినిమా జడ్జిమెంట్లో ఆయనే తోపంటారు. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో ఆయనకు తిరుగులేదంటారు. థియేటర్లను హోల్డ్ చేయడంలో ఆయనది మాస్టర్ మైండ్ అంటారు.
దిల్ రాజు! ఆయన పట్టిందల్లా బంగారం అంటారు. సినిమా జడ్జిమెంట్లో ఆయనే తోపంటారు. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో ఆయనకు తిరుగులేదంటారు. థియేటర్లను హోల్డ్ చేయడంలో ఆయనది మాస్టర్ మైండ్ అంటారు. ఇక ప్రొడ్యూసర్‌గా మారి ఆయన రెండు చేతులా సంపాదిస్తున్నారని అంటున్నారు. వరుస హిట్లతో.. ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారంటారు. కాని ఇదే స్టార్ ప్రొడ్యూసర్ తాజాగా ఓ షాకింగ్ కామెంట్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌కు స్ట్రెయిట్ గా ఒక మాట చెప్పారు. ఆ మాటతో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ఎస్ ! ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ పై ఇప్పటికే పట్టు సాధించిన దిల్ రాజు.. తాజాగా సంక్రాంతికి రిలజ్ అవుతున్న చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాలను కాదని… తన సినిమా వారసుడికే ఎక్కువ థియేటర్లను కేటియించారు దిల్ రాజు. తన డబ్బింగ్ సినిమాతో కంపేర్ చేస్తే.. టాలీవుడ్ టాప్ స్టార్ చిరు, బాయల్య కు తక్కువ థియేటర్స్ ఉండేలా చేశారు. దీంతో అటు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ తనపై విమర్శలు వచ్చేలా చేసుకున్నారు.అయితే ఇదే విషయమై తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఇండస్ట్రీలో అందరూ బిజినెస్ చేస్తున్నారని.. తాను కూడా బిజినెసే చేస్తున్నా అన్నారు. తన సినిమాను కాదని వేరే సినిమాలకు థియేటర్లు ఇవ్వలేను కదాని కుండ బద్దలు కొట్టారు. అయితే ఈ సినిమాలు రిలీజ్ చేసుకుంటున్న మైత్రీ మేకర్స్ కు థియేటర్ సమస్య ఉంటే.. వాళ్లే తన దగ్గరొకచ్చి మాట్లాడాలి కదా.. అన్నారు. వాళ్లే మాట్లాడనిది.. తానేమీ చేయలేనన్నట్టు.. చెప్పారు. అయితే రిలీజ్ విషయంలో ఫస్ట్ ప్రియారిటీ.. చిరు, బాలయ్యలదే అంటూ.. మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

