సల్మాన్‌తో దిల్ రాజు బిగ్ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరో తెలుసా
టాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతోన్న దిల్‌రాజు మరోసారి బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారు. ఒకప్పుడు తన బ్యానర్ నుంచి అనేక హిట్లు అందించిన దిల్ రాజు.. ఇటీవలి ఫ్యామిలీ స్టార్‌తో పాటు గేమ్ ఛేంజర్, తమ్ముడు సినిమాలతో పరాజయం మూటగట్టుకున్నారు. కాగా, సంక్రాంతికి వస్తున్నాం మూవీ మాత్రం ఆయనకు మంచి సక్సెస్‌ను అందించింది.
అటు.. గతంలో హిందీలో ఆయన తెరకెక్కించిన జెర్సీతో పాటు హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాలు.. తెలుగులో కల్ట్ క్లాసిక్‌లుగా నిలిచినా.. హిందీలో మాత్రం దారుణంగా నిరాశపరిచి.. భారీగా నష్టాలను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మళ్లీ ఎలాగైనా పుంజుకోవాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ భారీ ప్రాజెక్టును ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నట్లు సమాచారం. వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్‌కు ఓ కథ చెప్పారని, అందుకు సల్మాన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆయన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఇతర ఒప్పందాలు, మిగిలిన విషయాలపై దిల్ రాజు బృందంతో సల్మాన్ చర్చలు జరుపుతున్నారని బాలీవుడ్ వర్గాల టాక్. ఈ చర్చలు సఫలమైతే, త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టు అధికారికంగా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో తమిళ స్టార్ విజయ్ తో వారిసువంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన వంశీ పైడిపల్లి, ఇప్పుడు సల్మాన్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రైన్‌లో సీటు దొరకలేదని ఆ మహిళ ఏం చేసిందో చూడండి
బ్రతికుండగానే తన అంత్యక్రియలు చేసుకున్న వ్యక్తి.. ఆ తర్వాత
2026లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతో తెలుసా ??
Kolkata’s Underwater Metro: దేశంలోని తొలి అండర్ వాటర్ మెట్రోను చూశారా
