Game Changer: నన్ను తిట్టుకోవద్దు.! లీకులు ఇవ్వలేను.. గేమ్ ఛేంజర్‌పై నిర్మాత దిల్‌రాజు.
నిర్మాత దిల్‌రాజు తాజాగా గేమ్‌ఛేంజర్ పై ఆసక్తికర అప్‌డేట్స్ ఇచ్చారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందన్నారు. కాస్త ఓపిక పట్టమని అభిమానులను కోరారు. రామ్‌చరణ్ ఇప్పుడు మెగా పవర్‌స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్ అనీ ఆ స్థాయికి రీచ్ అయ్యేలా శంకర్ సినిమాను తీర్చిదిద్దుతున్నారనీ చెప్పారు. మరో రెండు నెలల్లో షూట్ పూర్తయితే ఐదు నెలల్లో రిలీజ్ చేస్తామనీ అన్నారు.
నిర్మాత దిల్‌రాజు తాజాగా గేమ్‌ఛేంజర్ పై ఆసక్తికర అప్‌డేట్స్ ఇచ్చారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందన్నారు. కాస్త ఓపిక పట్టమని అభిమానులను కోరారు. రామ్‌చరణ్ ఇప్పుడు మెగా పవర్‌స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్ అనీ ఆ స్థాయికి రీచ్ అయ్యేలా శంకర్ సినిమాను తీర్చిదిద్దుతున్నారనీ చెప్పారు. మరో రెండు నెలల్లో షూట్ పూర్తయితే ఐదు నెలల్లో రిలీజ్ చేస్తామనీ అన్నారు. చరణ్ బర్త్‌డేను పురస్కరించుకుని ‘జరగండి జరగండి’ పాట విడుదల చేశామనీ అన్నారు. థియేటర్‌లో ఈ పాట చూసి ప్రేక్షకులు తప్పకుండా డ్యాన్స్ చేస్తారనీ కామెంట్ చేశారు. కాస్త ఐదు నెలలు తనను తిట్టుకోకుండా ఓపిక పట్టండని కోరారు. ‘దిల్ మామా.. మాకొక అప్‌డేట్ ఇవ్వు’ అంటూ ఫ్యాన్స్ పెడుతున్న కామెంట్స్ చూస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి తాను ఎలాంటి లీకులు ఇవ్వలేననీ శంకర్ అప్‌డేట్ ఇవ్వమంటే ఇస్తాననీ దిల్ రాజు అన్నారు.
రామ్‌చరణ్ – శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కియారా అడ్వాణీ హీరోయిన్. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ యువ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది. దీని తర్వాత చరణ్… ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ‘ఆర్‌సీ 16’గా ఇది ప్రచారంలో ఉంది. జాన్వీ కపూర్ కథానాయిక. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తారు. ఇప్పటికే మూడు పాటలు కంపోజింగ్ పూర్తైందని.. రెహమాన్ అద్భుతంగా స్వరాలు అందించారని బుచ్చిబాబు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.