హిందీ సినిమాల్లో కనిపిస్తున్న సౌత్ డామినేషన్
ధనుష్ 'తేరే ఇష్క్ మే' భారీ బాలీవుడ్ తొలిరోజు కలెక్షన్లతో సౌత్ స్టార్ల ప్రభావాన్ని చాటింది. ఈ ఏడాది టాప్ ఓపెనింగ్స్‌లో ధనుష్ చిత్రం 8వ స్థానంలో నిలవగా, రష్మిక 'ఛావా', తారక్ 'వార్ 2' వంటి సౌత్ కనెక్టెడ్ సినిమాలు మొదటి స్థానాల్లో ఉన్నాయి. బాలీవుడ్ బాక్సాఫీస్‌పై సౌత్ సినిమాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
మామూలు సందర్భాల్లో చాలా విషయాల మీద ఫోకస్ ఉండదు. కానీ ఏదైనా ఓ స్పెషల్ విషయం జరిగినప్పుడు మాత్రం టాప్ టెన్‌లో ఎవరున్నారు? టాప్ ఫైవ్‌లో ఎవరున్నారు? వాళ్లతో మనకున్న రిలేషన్ ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఫ్లాష్ అవుతాయి. ఇప్పుడు ధనుష్ మూవీకి బాలీవుడ్‌లో డే ఒన్ వచ్చిన ఓపెనింగ్స్ తో నార్త్ లో సౌత్ కనెక్షన్ గురించిన టాపిక్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ధనుష్, కృతి సనన్ నటించిన తేరే ఇష్క్ మే మూవీ హిందీ ఓపెనింగ్ డే కలెక్షన్లు 15 కోట్ల దాకా వచ్చాయని అంచనా. దీన్ని బట్టి ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో దీని ప్లేస్ టాప్ ఎయిట్‌లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్ ఏంది అంటే 29.50 కోట్లతో ఛావా కనిపిస్తోంది. సెకండ్ ప్లేస్‌ని వార్ 2 సొంతం చేసుకుంది. 28 కోట్ల దాకా డే వన్ ఓపెనింగ్స్ వచ్చాయి ఈ మల్టీస్టారర్‌కి. అటు చావాలో రష్మిక నటిస్తే, ఇటు వార్2లో తారక్ స్పెషల్ అట్రాక్షన్. థర్డ్ టాపర్‌గా సికందర్ ఉంది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా రన్నింగ్‌లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే మురుగదాస్ డైరక్టోరియల్ మూవీకి డే ఒన్ మాత్రం మంచి క్రేజే కనిపించింది. రష్మిక నటించిన ఛావా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, థామా ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. 23 కోట్ల రూపాయలు ఓపెనింగ్ డే కలెక్షన్లు తెచ్చుకుని హిట్ టాక్ తెచ్చుకుందీ మూవీ. ఫైనల్‌గా ఫిఫ్త్ ప్లేస్‌లో హౌస్‌ఫుల్5 నిలిచింది. ఈ ఏడాది హిందీలో టాప్ ఓపెనింగ్ డే కలెక్షన్లతో సౌత్ వాళ్లకున్న షేర్‌ని గుర్తుచేసుకుని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాత కామిక్ బుక్ ధర అక్షరాల రూ.81 కోట్లు.. ఏ మాత్రం తగ్గనిసూపర్ మ్యాన్ క్రేజ్
ఇండియాలోనే ఖరీదైన నెంబరు ప్లేట్.. ధర ఎంతో తెలుసా ??
ఆ ఊర్లో సూర్యుడికి 64 రోజుల సెలవు
CM Revanth Reddy: ఫుట్‌బాల్ దిగ్గజంతో తలపడనున్న సీఎం రేవంత్
