AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను మారనంటున్న దీపిక.. మార్పు మంచిది కాదా ??

నేను మారనంటున్న దీపిక.. మార్పు మంచిది కాదా ??

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Nov 18, 2025 | 2:07 PM

Share

దీపిక పదుకోణ్ 8 గంటల పని దినాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు, అంతకంటే ఎక్కువ పనిచేయడం శారీరకంగా, మానసికంగా అలసట అని ఆమె వాదన. గతంలో నయనతార, ఆలియా వంటి వారు తమ డిమాండ్లను సర్దుబాటు చేసుకున్నారు. మరి కియారా అద్వానీ, దీపిక పదుకోణ్ బాటలో నడుస్తుందా లేదా తనకంటూ సొంత మార్గాన్ని ఏర్పరచుకుంటుందా అని గ్లామర్ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

గతంలో ఏమైనా చెప్పాలనుకున్నప్పుడుఆచితూచి ఆలోచించి మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఏం చేయాలనుకుంటే అదే చేస్తున్నానంటున్నారు దీపిక పదుకోన్‌. జస్ట్ ఈ మాట అనడమే కాదు, ఎయిట్‌ హవర్స్ వర్క్ గురించి మరోసారి స్ట్రాంగ్‌గా చెప్పేశారు. ఇంతకీ ఈ విషయంలో దీపికకు కియారా మద్దతిస్తారా? ఎనిమిది గంటల కన్నా ఎవరూ పనిచేయలేరు. శారీరకంగా, మానసికంగా అంత పని చేస్తే చాలు.. ఆ తర్వాత అలసిపోతాం. ఈ విషయంలో ఎవరు నాకు మద్దతు తెలిపినా, తెలపకపోయినా ఓకే అని అంటున్నారు దీపిక పదుకోన్‌. ఆ మధ్య నయన్‌ కూడా ఇద్దరు పిల్లల తల్లిగా మేకర్స్ కి చాలానే కండిషన్లు పెట్టారట. కానీ, దీపికలాగా బయటికి వచ్చి చెప్పలేదు నయన్‌. చెన్నైలోనే షూటింగ్‌.. ఆరులోపు ఇంట్లో ఉండాలి.. ఆదివారం సెలవు కావాలి.. ఇలాంటి చాలా మాటలే వినిపించాయి నయన్‌ విషయంలో. అయితే ఇప్పుడు పిల్లలు కాస్త పెద్ద వాళ్లయ్యాక ఔట్‌డోర్‌ షూట్‌లు కూడా చేస్తున్నారు నయన్‌. ఆలియా అన్నిటినీ బ్యాలన్స్ చేసుకుని షూట్‌ చేస్తున్నారు. మరి కియారా ఏం చేస్తారు? దీపికని ఫాలో అవుతారా? లేకుంటే, గుట్టుగా తన మేకర్స్ కి సర్దిచెప్పుకుంటారా? మిసెస్‌ కియారా ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్‌ చేస్తారో చూడాలనుకుంటోంది గ్లామర్‌ ఇండస్ట్రీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్లోబ్‌ షేకింగ్‌.. మహేష్‌ బొమ్మ ఇంటర్నేషనల్‌

Chiranjeevi: కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో చిరు.. సరికొత్త లుక్ లో మెగాస్టార్

యానిమేషన్‌ ప్రధానంగా ప్రభాస్‌ – ప్రేమ్‌రక్షిత్‌ సినిమా

హీరోల సినిమాల సంఖ్య పెరగాలంటే.. కెప్టెన్లు స్పీడు పెంచాల్సిందేనా

ధనుష్ దర్శకత్వంలో రజినీ సినిమా ??