CPI Naarayana on jai bheem: ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పటి సంఘటన అది..! 37 ఏళ్ల ఘటనను గుర్తుచేసింది.. (వీడియో)

|

Nov 14, 2021 | 9:09 AM

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. టీజీ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‏లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 1993లో తమిళనాడులో గిరిజన మహిళ తరపున న్యాయం కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు.


తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. టీజీ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‏లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 1993లో తమిళనాడులో గిరిజన మహిళ తరపున న్యాయం కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశం తో సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మంచి టాక్‏తో.. ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ గురించి సీపీఐ జాతీయ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ స్పందించారు. జైభీమ్ సినిమా .. తన జీవితంలో జరిగిన ఘటనను గుర్తుచేసిందన్నారు.

“జైభీమ్ సినిమా చూశాను. నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని చాలా బలంగా అందరి కళ్లకు కట్టినట్టు చూపించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసినట్టు నాకు కనబడలేదు. అశ్లీలత, ఫైటింగ్లు లేవు. ఉన్నతమైన నేటి సమాజం, ప్రత్యేకంగా యువ న్యాయవాది సమాజం ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యతను, సందేశాత్మక సంకేతాలనే జై భీమ్ సినిమా సమాజానికి పంపింది” అని సీపీఐ నారాయణ అన్నారు.

“ప్రజా ఉద్యమాల్లోనే ఉంటున్న నాకు ఈ సినిమాలోని సినతల్లి ఘట్టానికి నాకు అవినాభావ సంబంధం ఉంది. 37 ఏళ్ల కిందటి అచ్చం ఇలాంటి ఘటనే తనకు ఎదురైంది.. నేను చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్మిగా ఉండగా తిరుమలలో జరిగిన ఓ వాస్తవ సంఘటన గుర్తుకు వచ్చింది. పోలీసుల తరమడంతో తలకు దెబ్బ తాకి ఓ కోతిని ఆడించుకునే మహిళ మరణించింది. ఇక అక్కడే ఉన్న నేను మా మిత్రులం పక్కనే ఉన్నతోపుడు బండిపై ఆమె మృతదేహాన్ని పడుకోబెట్టి నిరసన ప్రారవబించాం. బంద్‌కు పిలుపు నిచ్చాం.. కాని అదే రోజు ఆనాటి ముఖ్యమంత్రి తిరుమల పర్యటన ఉండడంతో.. పోలీసులు బంద్‌కు పిలుపునిచ్చిన తనను తిరుపతి క్యాంప్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. నగరంలో ముఖ్యమంత్రి పర్యటన ఉంది కాబట్టి మీరు తలపెట్టిన బంద్‌ను ఉపసంహరించుకోవాలని ఆనాటి కలెక్టర్ సుబ్బారావ్ గారు, ఎస్పీ కోరారు. వారి ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. ఆసమయంలో అధికారులు ఇద్దరూ నాతో.. చనిపోయిన లక్ష్మిది ఈప్రాంతం కాదు, ఆస్తిపరూరాలు కాదు, కుల బలం లేదు. ఆలాంటి వ్యక్తి కోసం మీరు పోరాటం చేస్తే మీకు గానీ, మీపార్టీకిగానీ వచ్చే లాభం ఏమిటి అని అడగంతో పాటు పై నుంచి మీపై కేసులు పెట్టడం తప్ప అని వ్యాఖ్యానించారు. వారికి ఒకే సమాధానంగా… “మా ఉద్యమం వలన సామాజిక చైతన్యం కలిగి సామాన్య ప్రజలు కూడా ధైర్యంగా నివసించగలరు. అదే సమయంలో అధికారులు కూడా బాధ్యతగా ప్రవర్తించేందుకు ఈ ఉద్యమం అవసరం అనేసాను.. ఏమిటో ఈయన మార్క్సిజాన్ని తిరగేసి చదువుతున్నారు” అని కామెంట్ కూడా చేశారు. మరుసటిరోజు బంద్ విజయవంతంగా జరిగింది. పోలీసులు ముందుగానే అన్నట్టుగా మాపై కేసులు కూడా పడ్డాయి. చిత్తూరు సబ్ జైలులో వారం పాటు నిర్బందించారు. “అని ఆనాటి సంఘటనను గుర్తుకు నారాయణ గుర్తుకు తెచ్చున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…