కటౌట్‌తో పనేంటి ?? కంటెంట్ ఉంటే చాలు.. హిట్టు పక్కా

Edited By:

Updated on: Jan 20, 2026 | 4:32 PM

బిజీ జీవితాల్లో ప్రేక్షకులు థియేటర్లలో కేవలం యాక్షన్ సినిమాలనే కాకుండా, కంటెంట్-ఆధారిత, నవ్వులు పంచే చిత్రాలను ఆదరిస్తున్నారు. "అనగనగా ఒక రాజు" వంటి సినిమాలు సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, నాలుగు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్ అయ్యాయి. "టిల్లు", "మ్యాడ్" వంటి చిత్రాలు కూడా నవ్వించి వసూళ్లను సాధించాయి. కడుపుబ్బా నవ్వించగలిగితే, పెద్ద స్టార్లు లేకపోయినా ప్రేక్షకులు సినిమాను విజయం చేస్తారని ఇది రుజువు చేస్తుంది.

నిత్యం ఉరుకులు పరుగులతో బిజీ బిజీగా ఉండే ప్రేక్షకులు థియేటర్లలో యాక్షన్‌ సినిమాలనే కాదు.. కంటెంట్‌ ఓరియంటెడ్‌ ఎంటర్‌టైనర్లనూ ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలో పెద్ద పెద్ద కట్‌ ఔట్లున్నాయా? లేదా? అనే విషయాలను పట్టించుకోవడం లేదు.. కడుపుబ్బా నవ్వుకున్నామా? లేదా? అనేదే కాన్సెప్ట్. అనగనగా ఒక రాజు సంక్రాంతి రేసులో దూసుకుపోతోంది. కంటెంట్‌కి ఆడియన్స్ కనెక్ట్ అయితే కాసులు కురవడం గ్యారంటీ అనే విషయం ఇంకో సారి ప్రూవ్‌ అయింది. రిలీజ్‌ అయిన నాలుగు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ అయి వరల్డ్ వైడ్‌ 82 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంక్రాంతి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది అనగనగా ఒక రాజు. నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన అనగనగా ఒక రాజు మాత్రమే కాదు… థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ప్రతిసారీ కాసులు కురిశాయి. సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు అండ్‌ టిల్లు స్క్వేర్‌కి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. త్రీక్వెల్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అయి వెయిటింగ్‌ వారు. పాపులర్‌ హీరోలే ఉండక్కర్లేదు.. ఆద్యంతం నవ్విస్తే బొమ్మను ఆడియన్స్ బ్లాక్‌ బస్టర్‌ చేయడం గ్యారంటీ అనడానికి మరో మంచి ఎగ్జాంపుల్‌ మ్యాడ్‌. మ్యాడ్‌ సీక్వెల్‌కి కూడా బాక్సాఫీస్‌ దగ్గర మంచి గలగలలు వినిపించాయి. థియేటర్లలో మాస్‌ యాక్షన్లనే కాదు, లాజిక్కులే లేకపోయినా హాయిగా నవ్వించే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఇవన్నీ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటున్నారు క్రిటిక్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్‌ నెక్స్ట్ సినిమా

వంద కోట్ల క్లబ్ లో.. సత్తా చాటుతున్న సీనియర్ హీరోలు

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్.. యాక్షన్ రూట్ లో సీనియర్ బ్యూటీస్

2027 సమ్మర్ క్లాష్.. ఇప్పటి నుండే రచ్చ రచ్చ

కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే కలెక్షన్ల వర్షం.. లేకుంటే