Sandeep Raj-Chandini Rao: హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం వీడియో..

|

Dec 08, 2024 | 9:49 PM

కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ వివాహం డిసెంబర్ 07 తిరుమలలో ఘనంగా జరిగింది. తన తొలి సినిమా కలర్ ఫొటోలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో కలిసి సందీప్ ఏడడుగులు నడిచారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఇవాళ తిరుమల శ్రీవారి సాక్షిగా ఏకమయ్యారు.

ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సందీప్ రాజ్ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక సందీప్ రాజ్ తొలి సినిమా హీరో సుహాస్ సతీసమేతంగా ఈ వివాహ వేడుకకు హాజరయ్యాడు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించాడు. అలాగే కలర్ ఫొటో సినిమాలో తన నటనతో కన్నీళ్లు తెప్పించిన వైవా హర్ష కూడా సందీప్ రాజ్ పెళ్లిలో సందడి చేశాడు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.