‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ పాట గురించి గమ్మత్తయిన విషయం చెప్పిన చిరు

Updated on: May 07, 2025 | 4:13 PM

మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వైజయంతీ మూవీస్ నిర్మించిన క్లాసిక్ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, మే 9వ తేదీన ఈ చిత్రాన్ని మరోసారి రీ రిలీజ్ చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాట గురించి చిరంజీవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ రోజుకు కూడా ఎంతో ఆకర్షణీయంగా అనిపించే పాట ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ అని ఆయన అన్నారు. ఈ పాట ఒక్క రోజులో రికార్డింగ్ అయిందంటే చాలామంది ఆశ్చర్యపోతారని పేర్కొన్నారు. ఒక్క రోజు కూడా కాదు, ఉదయం 9 గంటలకు ఇళయరాజా గారు రికార్డింగ్ హాలు వద్ద కూర్చుని 11-12 గంటల మధ్య తాము పక్క సెట్‌లో షూట్ చేస్తుండగా, ఈ పాట బాగుందా వినండి అంటూ ఒక ట్యూన్ పంపించారని, వినగానే రాఘవేంద్రరావు గారికి, దత్తు గారికి, తనకుకూడా చాలా బాగా నచ్చేసిందని తెలిపారు. పాట చాలా బాగుంది.. సింపుల్‌గా ఉంది.. మంచి రిథమ్‌తో ఉంది. రిథమ్ కూడా చాలా కొత్తగా ఉందనిపించింది అని ఆయన అన్నారు. వేటూరి గారితో కూర్చుని లంచ్ టైమ్‌లో అమ్మనీ కమ్మనీ దెబ్బ అంటూ ఎంతో తియ్యగా ఉందో యబ్బా వేటూరిగారు రాయడం.. బాలుగారు వచ్చి పాడటం అంతా అలా జరిగిపోయిందని చిరంజీవి వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాతకు తగ్గ మనవడు !! అరుదైన ఘనత సాధించిన శోభన్ బాబు మనవడు

AI సాయంతో పూర్తి సినిమా తీసిన డైరెక్టర్! అవుట్ పుట్ అదిరిపోయింది

దారుణం !! తెలుగు డైరెక్టర్‌ను అవమానించిన విజయ్‌ దళపతి