Chiranjeevi – Bhola Shakar: సమస్యల సుడిగుండంలో భోళా శంకర్.. చివరికి చిరు నిలిచినట్టేనా..?

Updated on: Aug 11, 2023 | 8:59 AM

మొదట భోళా శంకర్ ప్రొడ్యూసర్స్‌ పై ... ఈసినిమా రిలీజ్‌ పై సిటీ సివిల్ కోర్టులో కేసు నమొదైంది. ఏకే ఎంటర్‌ టైన్మెంట్ నిర్మాతలు.. తనను మోసం చేశారని గాయత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌ బత్తుల సతీష్ .. కోర్టుకెక్కడం ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక దానికి తోడు.. ఆవెంటనే! ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అజిత్ వేదాలం సినిమా స్టోరీ క్రింజ్‌లా ఉంటుందని.. డైరెక్టర్ మెహర్ రమేష్ కామెంట్ నెట్టింట వైరల్ అయింది.

మెహర్ రమేష్‌ డైరెక్షన్లో.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ప్రొడక్షన్లో.. చిరూస్ 155th సినిమాగా తెరకెక్కుతున్న ఫిల్మ్ భోళా శంకర్. అజిత్ వేదాలం సినిమాకు రిమేక్‌గా తెరకెక్కిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 11న రిలీజ్‌కు రెడీ అయింది. కానీ ఈ క్రమంలోనే సమస్యల వలయంలో చిక్కుకుంది ఈ సినిమా..! ఇక ఎప్పుడూ ఎలాంటి వివాదాలు లేకుండా.. చాలా ధూంధాంగా రిలీజ్ అయ్యే చిరు సినిమా.. ఈసారి మాత్రం.. కొంత మంది విమర్శల మధ్య.. మరికొంత మంది నిరసలు మధ్య.. ఇంకొందరి ఆందోళనల మధ్య రిలీజ్ అవుతోంది.

మొదట భోళా శంకర్ ప్రొడ్యూసర్స్‌ పై.. ఈసినిమా రిలీజ్‌ పై సిటీ సివిల్ కోర్టులో కేసు నమొదైంది. ఏకే ఎంటర్‌ టైన్మెంట్ నిర్మాతలు.. తనను మోసం చేశారని గాయత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌ బత్తుల సతీష్ .. కోర్టుకెక్కడం ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక దానికి తోడు.. ఆవెంటనే! ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అజిత్ వేదాలం సినిమా స్టోరీ క్రింజ్‌లా ఉంటుందని.. డైరెక్టర్ మెహర్ రమేష్ కామెంట్ నెట్టింట వైరల్ అయింది. తళా అజిత్ ఫ్యాన్స్‌కు కోసం తెప్పించింది. భోళా శంకర్ సినిమాపై.. డైరెక్టర్‌ మెహర్ తీరుపై విరుచుకుపడేలా చేసింది. ఇక ఆ వెంటనే వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్లో.. చిరు ఏపీ సర్కార్‌ తీరుపై సెటైరికల్ కామెంట్స్‌ చేయడం .. తెలుగు టూ స్టేట్స్‌లో సెన్సేషన్గా మారింది. యాక్టర్స్ రెమ్యూనరేషన్‌ పై కాదు.. హోదాపై మాట్లాడండి అని నాయకులకు చిరు చెప్పడం.. రాజకీయ రచ్చకు తెరతీసింది. ఇక దాని పరిణామమే అన్నట్టు.. భోళా శంకర్ సినిమా టికెట్ ప్రైస్‌ రిక్వెస్ట్‌ను ఏపీ ప్రభుత్వం తిర్కరించింది. సరైన పత్రాలు లేవని.. మీడియా ముఖంగా చెప్పి మరీ.. భోళా కలెక్షన్స్‌కు గండి కొట్టింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...