Charmy Kaur: ఒక్క క్షణం ఛార్మీకి చుక్కలు చూపించారుగా !!

Charmy Kaur: ఒక్క క్షణం ఛార్మీకి చుక్కలు చూపించారుగా !!

Phani CH

|

Updated on: Jul 21, 2022 | 9:06 PM

ఇసుకేస్తే కింద పడనంతగా జనం.. లైగర్ బాయ్ VDని దగ్గరి నుంచి చూడాలనే ఆరాటం. అందులోనూ ట్రైలర్ కిక్కును ఫస్టే విట్‌నెస్ చేయాలనే ఉబలాటం.

ఇసుకేస్తే కింద పడనంతగా జనం.. లైగర్ బాయ్ VDని దగ్గరి నుంచి చూడాలనే ఆరాటం. అందులోనూ ట్రైలర్ కిక్కును ఫస్టే విట్‌నెస్ చేయాలనే ఉబలాటం. వెరసి విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ థియేటర్ లోపలికి వెళ్లేందుకు చేశారు ఓ చిన్న పాటి పోరాటం. అయితే వీరు చేసిన ఈ చిన్న పోరాటం.. లైగర్ టీంను కాస్త ఇబ్బంది పడేలా.. ఇంకాస్త చిరాకు పడేలా చేసింది. తామే థియేటర్ లోపలికి వెళ్లేందుకు కష్టపడేలా చేసింది. ఇక ఈ క్రమంలోనే.. ఛార్మి అభిమానుల మధ్య కొద్ది సేపు ఇరుక్కి పోయింది. ఎస్ ! లైగర్ టీంతో పాటు చాలా కష్టపడి థియేటర్‌ లోపలికి వెళ్లిన ఛార్మి.. స్టేజ్‌ పైకి వెళ్లే క్రమంలో.. ఒక్క క్షణం అభిమానుల మధ్య ఇరుక్కుపోయింది. ఆ వెంటనే బాక్సర్స్ సాయంతో.. స్టేజ్‌ పైకి ఎక్కేసింది. అయితే ఛార్మికి మాత్రమే కాదు.. ఆల్మోస్ట్ లైగర్ టీంలోని అందరికీ ఇలాంటి పరిస్థితే ఎందురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది కూడా..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాక్కీ కిరికిరి.. విజయ్ చింపేశిండు మాటలతో కొట్టేసిన పూరీ

ఇంట్రెస్టింగ్.. లైగర్ వెనుక ఉంది మెగాస్టారా !!

Published on: Jul 21, 2022 09:06 PM