Chandra Bose Strog Reply: యండమూరి విమర్శలకు చంద్రబోస్ దిమ్మతిరిగే ఆన్సర్.. వీడియో.
ఒక పాటకు..! ఒక ప్రయత్నానికి...! అభినందనతో.. పాటు విమర్శ కూడా ఉంటుందని.. ఆ విమర్శే విషయ నిబద్దతను రాటు దేలుస్తుందిని అంటున్నారు చంద్రబోస్.
ఒక పాటకు..! ఒక ప్రయత్నానికి…! అభినందనతో.. పాటు విమర్శ కూడా ఉంటుందని.. ఆ విమర్శే విషయ నిబద్దతను రాటు దేలుస్తుందిని అంటున్నారు చంద్రబోస్. తను రాసిన వాల్తేరు వీరయ్య పాటలోని లిరిక్స్‌ను..! ఆ లిరిక్స్‌లో తాను చేసిన కొన్ని పద ప్రయోగాలను తప్పబట్టిన యండమూరికి చాలా గట్టిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలంకారాలకు అనుగుణంగానే కవిత్యం.. పాటలో సాహిత్యం సాగుతుందని.. తాను అదే చేశానన్నారు. విరోదాభాసాలంకారం అనుగుణంగానే తన పాటలోని సాహిత్యాన్ని కూర్చానన్నారు. దీన్నే ఇంగ్లీష్‌లో ఆగ్జీమోరాన్స్ అని కూడా అంటారన్నారు.ఎంతో ఆలోచించి శోధన చేసి మరీ ఈ పాటకు సాహిత్యం అందించానని.. చంద్రబోసు అన్నారు. అలంకారాలు మీద అవగాహన తో.. పూర్తి స్పృహతో ఈ పాటలో పదాలు కూర్చానన్నారు. సాహిత్యంలోని లోతు చాలా తక్కువ మందికి అర్థం అవుతుందని.. ఈ పాట లోతు కూడా అర్థం గమనించాలని.. అలా చేయకుండా విమర్శలు చేస్తే ప్రతివిమర్శలు వస్తాయని యండమూరిపై కాస్త ఘాటుగా… ఇన్డైరెక్ట్ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos