Champion: రిలీజ్‌కు ముందే ఛాంపియన్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్

Updated on: Dec 24, 2025 | 1:14 PM

టాలీవుడ్‌లో ఓటీటీ హక్కులు నిర్మాతలకు పెద్ద బోనస్‌గా మారాయి. సినిమా విడుదల కాకముందే ఆదాయాన్ని తెచ్చిపెట్టి, నష్టాల నుంచి కాపాడుతున్నాయి. రోషన్ నటించిన 'ఛాంపియన్' సినిమా రికార్డు స్థాయిలో రూ.16 కోట్లకు ఓటీటీ డీల్ కుదుర్చుకుంది. స్టార్ హీరోలు లేకపోయినా ఇంత పెద్ద డీల్ సెట్ అవ్వడం, సినిమా వ్యాపారంలో ఓటీటీ పాత్ర ఎంత కీలకమో స్పష్టం చేస్తుంది.

ఇప్పుడు టాలీవుడ్‌ ప్రొడ్యూసర్లకు ఓటీటీ రైట్స్ బిగ్ బోనస్ గా మారుతున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందే ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అంతేకాదు నష్టాల బాధ నుంచి.. ప్రొడ్యూసర్లను కాపాడుతున్నాయి. దీంతో ఓ సినిమాను మొదలెట్టే క్రమంలో ఓటీటీ డీల్స్ కోణంలో కూడా మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈక్రమంలోనే రోషన్ ఛాంపియన్ సినిమాకు కూడా రికార్డ్‌ రేంజ్‌ ధరకు ఓటీటీ హక్కులు పలికాయనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ యాక్షన్‌ చిత్రం ఛాంపియన్. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌లో అంచనాలు పెంచేసింది. ఈక్రమంలోనే ఛాంపియన్ మూవీకి రిలీజ్‌కు ముందే ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను… ఓ ఓటీటీ సంస్థ.. దాదాపు రూ.16 కోట్లకు దక్కించుకున్నట్టుగా టాక్ బయటికి వచ్చింది. పెద్ద స్టార్స్ లేకపోయినా ఈ రేంజ్‌లో డీల్ సెట్ చేశారంటే మూమూలు విషయం కాదనేది ఫిల్మ్ అనలిస్టులు కామెంట్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

రైలు ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఛార్జీలు

మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు

Egg Price: మండిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్ ఎంతంటే

ఊబకాయాన్ని తగ్గించే బ్యాక్టీరియా.. పరిశోధకుల కీలక ముందడుగు