Border 2: 28 ఏళ్ళ తర్వాత వస్తున్న ఆ సీక్వెల్

Edited By:

Updated on: Dec 18, 2025 | 5:19 PM

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కెరీర్‌కు 'గదర్ 2' ఊపిరి పోసింది. 20 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆయనకు 600 కోట్ల భారీ హిట్ దక్కింది. ఇప్పుడు అదే జోష్‌తో ఆయన 'బోర్డర్ 2' సీక్వెల్‌తో వస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ అంచనాలను పెంచింది. వరుణ్ ధావన్, దిల్జీత్ దోసంత్ వంటి నటులు కూడా ఇందులో భాగం. రిపబ్లిక్ డే వీకెండ్‌లో 'బోర్డర్ 2' భారీ వసూళ్లను సాధిస్తుందని అంచనా.

ఒక్క హిట్టు కెరీర్‌ను ఎంత మార్చేస్తుందడానికి బాలీవుడ్‌లో ఓ సీనియర్ హీరోనే నిదర్శనం. 20 ఏళ్లుగా హిట్లు లేని ఆయనకు.. ఒకే ఒక్క విజయం ఊపిరి పోసింది. ఆ జోష్‌తో వరస సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ ఓ సీక్వెల్‌తో 600 కోట్లు కొట్టిన ఆ సీనియర్.. ఇప్పుడు మరో సెన్సేషనల్ సీక్వెల్‌తో వస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. మరి ఆ హీరో ఎవరో చూద్దామా.. బోర్డర్.. కేవలం బాలీవుడ్ హిస్టరీలోనే కాదు.. మొత్తం ఇండియన్ సినిమా చరిత్రలోనే నిలిచిపోయిన అద్భుతమైన వార్ డ్రామా. జేపీ దత్తా తెరకెక్కించిన ఈ చిత్రం 1997లో విడుదలైంది. సన్నీడియోల్‌తో పాటు మరో అరడజన్ మంది హీరోలు ఇందులో నటించారు. అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమాకు సీక్వెల్ వస్తుందిప్పుడు. బోర్డర్‌లో సన్నీతో పాటు జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా, సునీల్ శెట్టి లాంటి స్టార్స్ కూడా నటించారు. తాజాగా వస్తున్న బోర్డర్ 2లో సన్నీ డియోల్ కంటిన్యూ అవుతుండగా.. కొత్తగా వరుణ్ ధావన్, దిల్జీత్ దోసంత్, అహాన్ శెట్టి యాడ్ అయ్యారు. ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకుడు. జనవరి 23న విడుదల కానుంది బోర్డర్ 2. రెండేళ్ల కింద గదర్ 2తో ఫామ్‌లోకి వచ్చారు సన్నీ డియోల్. ఈ ఏడాది జాట్‌లో నటించారు. గదర్ 2 సినిమా ఏకంగా 600 కోట్లు వసూలు చేసింది.. అదే అంచనాలు బోర్డర్ 2పై కూడా ఉన్నాయి. పైగా రిపబ్లిక్ డే వీకెండ్ విడుదలవుతుంది ఈ చిత్రం. ఆల్రెడీ 20 ఏళ్ళ తర్వాత గదర్ 2తో మ్యాజిక్ చేసిన సన్నీడియోల్.. ఈ సారి బోర్డర్ 2తోనూ అదే చేయాలని చూస్తున్నారు. పైగా దేశభక్తి సినిమాల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అది కూడా బోర్డర్ 2కు హెల్ప్ కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Demon Pavan: అప్పుడు ఇజ్జత్‌ పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు హీరోలా నిలబడ్డాడు

Bharani: గెలవకున్నా పర్లేదు.. ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ దక్కించున్న భరణి

నటిని కిడ్నాప్ చేసిన ఆమె భర్త !! కట్ చేస్తే ??

Emanuel: ఇమ్మాన్యుయేల్ గెలవడం కష్టమేనా ??

కొత్త సినిమా ప్ర‌క‌టించిన కొద్ది రోజుల‌కే..దర్శకుడి కొడుకు లిఫ్ట్‌ ప్రమాదంలో మృతి

Published on: Dec 18, 2025 05:17 PM