చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు
బుక్ మై షో రివ్యూ రేటింగ్‌లతో మేకర్స్‌కు ఎదురవుతున్న సమస్యలపై ఈ ఆర్టికల్ విశ్లేషిస్తుంది. యాంటీ ఫ్యాన్స్ ఇచ్చే నెగిటివ్ రివ్యూలతో సినిమాలు ప్రభావితమవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, ‘మన శంకర వర ప్రసాదు గారు’ చిత్రంతో పాటు ఇతర సంక్రాంతి సినిమాలు కోర్టు ఆదేశాలతో బుక్ మై షోలో రేటింగ్ ఆప్షన్ నిలిపివేశాయి. ఇది సినిమాలను అన్యాయమైన నెగిటివ్ ప్రచారాల నుండి కాపాడుతోంది.
బుక్ మై షోలో రివ్యూ ఆప్షన్ మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది. దీని వల్ల.. రివ్యూ రేంటింగ్ జెన్యూన్ గా ఉండడం లేదని.. ఫలితంగా సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయని మేకర్స్ బలంగా వాదిస్తున్నారు. ఈక్రమంలోనే మన శంకర వర ప్రసాదు గారు టీం.. బుక్ మై షో రివ్యూ రేంటింగ్ కు చెక్ పెట్టింది. తమ సినిమాకు బుక్ మై షోలో రివ్యూ రేటింగ్ ఆప్షన్ లేకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంది. దీంతో బుక్ మై షో కూడా కోర్టు తీర్పుకు అనుగుణంగా మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో యాంటీ ఫ్యాన్స్ పేరుతో చాలా మంది కావాలని సినిమాలకు నెగిటివ్ రివ్యూ, రేటింగ్ లు ఇస్తున్నారు. దానివల్ల మంచి సినిమాలపై ప్రభావం పడుతోంది. ఆలాంటి సిచువేషన్ మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు రాకూడదని మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. దీంతో, కోర్టు మేకర్స్కు సానుకూలంగా తీర్పును వెల్లడించింది. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ప్రభాస్ రాజాసాబ్ మినహాయించి మిగతా అన్ని సినిమాలు కూడా బుక్ మై షో రివ్యూ రేటింగ్ ఈ విషయంలో కోర్టు నుంచి పెర్మిషన్స్ తీసుకున్నాయి. రవి తేజ హీరోగా వస్తున్న భర్త మనశయులకు విఙ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడుమ మురారి, నీవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలకు కూడా కోర్టు ఇదే తీరును ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ బుక్ మై షో కూడా మార్పులు చేసింది. ఈ మూడు సినిమాలకు రివ్యూ అండ్ రేటింగ్ ఆప్షన్ ను డిజేబుల్ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమా రిలీజ్ అగిపోవడంతో.. జననాయగన్ ప్రొడ్యూసర్ ఎమోషనల్..
AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన
సంక్రాంతినాడు వీటిని దానం చేస్తే.. శనిదేవుడి ప్రసన్నంతో వందరెట్ల పుణ్యఫలం
వచ్చే నెలలో మరో DSC నోటిఫికేషన్.. ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసా ??
